Praveen tambey biopic: ఇటీవల కాలంలో క్రీడా నేపథ్యం చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్‌లు రాగా.. ఇప్పుడు మరో క్రికెటర్ జీవితం సినిమాగా రానుంది. భారత క్రికెటర్ ప్రవీణ్ తాంబే జీవితం ఆధారంగా 'ప్రవీణ్ తాంబే ఎవరు?' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రేయాస్ తల్పడే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 41 ఏళ్ల వయసులో ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ప్రవీణ్ తాంబే. ఈ చిత్రం గురించి క్రికెటర్ తాంబే మాట్లాడుతూ.."నా జీవిత కథ ఎందరికో స్ఫూర్తిగా నిలవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత ఆ జాబితాలో మరికొంతమంది చేరతారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ నిరంతరం ప్రయత్నించాలి. ఎవరికి వారు తమ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వెనకడుగు వేయొద్దు" అని చెప్పుకొచ్చారు.
-
Kaun hai Pravin Tambe? Cricket ka most experienced debutante, and the most inspiring cricket story never told!#KaunPravinTambe in Hindi, Tamil and Telugu, trailer out on 9th March. pic.twitter.com/aLIfIa8zCB
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kaun hai Pravin Tambe? Cricket ka most experienced debutante, and the most inspiring cricket story never told!#KaunPravinTambe in Hindi, Tamil and Telugu, trailer out on 9th March. pic.twitter.com/aLIfIa8zCB
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022Kaun hai Pravin Tambe? Cricket ka most experienced debutante, and the most inspiring cricket story never told!#KaunPravinTambe in Hindi, Tamil and Telugu, trailer out on 9th March. pic.twitter.com/aLIfIa8zCB
— Disney+ Hotstar (@DisneyPlusHS) March 7, 2022
నాగశౌర్య కొత్త సినిమా రిలీజ్ డేట్
Nagashourya Krishna vrinda vihari release date: యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న థియేటర్లలో విడుదల కానుంది. ఐరా క్రియేషన్స్ సంస్థ రూపొందించిన ఈ సినిమాకు అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించారు. షెర్లియా సేతి హీరోయిన్గా నటించింది. ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పకులు. సీనియర్ నటి రాధిక ముఖ్యభూమిక పోషిస్తుండగా, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషస్తున్నారు.
ఇదీ చూడండి: This week movies: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!