'మరక్కర్' చిత్రం జాతీయ పురస్కారానికి ఎంపికవ్వడం పట్ల మలయాళ నటుడు మోహన్‌లాల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను నటించిన సినిమాకు ఇలాంటి గౌరవం లభించడం గర్వంగా ఉందని అన్నారు. ఈ ఘనత అంతా చిత్ర నిర్మాత ఆంటోనీ పెరంబవూర్కే దక్కుతుందని తెలిపారు. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందని మోహన్‌లాల్ అభిప్రాయపడ్డారు.
'మరక్కర్' సినిమాకు ఉత్తమ చలనచిత్రం సహా గ్రాఫిక్స్, కాస్ట్యూమ్ విభాగంలో జాతీయ అవార్డులు వరించాయి. ఏడాదిగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీతో పాటు చైనీస్ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఈ పురస్కారాన్ని మోహన్‌లాల్‌కు అంకితమిస్తున్నట్లు నిర్మాత అంటోనీ వెల్లడించారు.
ఇదీ చూడండి: కం'గన్': అభినయ 'మణికర్ణిక'.. ఫైర్‌బ్రాండ్!