ETV Bharat / sitara

శంకర్​కు, నాకు కొద్దిలో చావు తప్పింది: కమల్ హాసన్​ - entertainment news

నిన్న రాత్రి జరిగిన క్రేన్ ప్రమాదంలో తను, దర్శకుడు శంకర్.. కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నామన్నాడు హీరో కమల్​హాసన్. అనంతరం ఆ సంఘటన గురించి వివరించాడు.

శంకర్, నేను కొద్దిలో చావు తప్పించుకున్నాం: కమల్​
దర్శకుడు శంకర్ కమల్ హాసన్
author img

By

Published : Feb 20, 2020, 8:03 PM IST

Updated : Mar 1, 2020, 11:58 PM IST

'భారతీయుడు-2' షూటింగ్​ స్పాట్​లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో, తాను కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నానని హీరో కమల్​హాసన్ చెప్పాడు. చిత్రబృందంలోని ముగ్గురు సభ్యులు ఈ ఘటనలో మరణించారు. అయితే ప్రమాదాలు సునామీ వంటివని.. వాటికి ధనిక, పేద తేడా ఉండదని కమల్ అన్నాడు.

"మేం కొద్దిలో చావు నుంచి తప్పించుకున్నాం. ప్రమాదం జరగడానికి నాలుగు సెకన్ల ముందే దర్శకుడు శంకర్, కెమెరామెన్ అక్కడి నుంచి కదిలారు. ఆ ప్రదేశం దగ్గర్లోనే నేను, హీరోయిన్ కాజల్ నిలబడి ఉన్నాం" -కమల్​హాసన్, కథానాయకుడు

ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాడు కమల్. ఇది కేవలం సహాయం మాత్రమేనని, ముందుముందు ఇలాంటివి జరగకుండా చూస్తామని చెప్పాడు. ఇది తన బాధ్యతే కాదని, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలు సాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

భారతీయుడు-2 క్రేన్ ప్రమాద దృశ్యాలు

ఇవీ చదవండి:

Last Updated : Mar 1, 2020, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.