ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా ప్రభావం హాలీవుడ్‌నూ దెబ్బకొట్టింది. ఓ వ్యక్తికి కరోనా సోకడం వల్ల 'మిషన్ ఇంపాజిబుల్ 7' (Mission Impossible 7) కోసం లండన్‌లో వేసిన సెట్‌ను అధికారులు మూసేశారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ పారామౌంట్ పిక్చర్స్ (Paramount Pictures) ఈ షెడ్యూల్‌ని వాయిదా వేసింది.
"సెట్లో ఒకరికి పాజిటివ్ రావడం వల్ల 'మిషన్ ఇంపాజిబుల్ 7' చిత్ర నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నాం. జూన్ 14 తర్వాత మళ్లీ పనులు మొదలుపెడతాం. సెట్లో మేము అన్ని జాగ్రత్త చర్యలూ పాటిస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం" అని పారామౌంట్ నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ నుంచి ఇప్పటివరకు ఆరు భాగాలు వచ్చాయి. ఏడో భాగం సెట్స్‌పై ఉంది. అన్ని భాగాల్లోనూ హీరోగా నటిస్తూ వస్తున్న టామ్ క్రూజ్ (Tom Cruise) ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయటానికి నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది.