ETV Bharat / sitara

93 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఆస్కార్​ వాయిదా! - ఆస్కార్​ 2021

కరోనా సంక్షోభం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడొచ్చని ప్రచారం జరుగుతోంది. అనేక హాలీవుడ్​ చిత్రాల విడుదల వాయిదా పడటం వల్ల నామినేషన్లలో పరిమిత సినిమాలే ఉంటాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

COVID-19 effect: First time in 93 years, Oscars to get delayed by four months
93 ఏళ్ల చరిత్రలో మొదటిసారి ఆస్కార్​ వాయిదా!
author img

By

Published : May 13, 2020, 12:33 PM IST

కరోనా సంక్షోభంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఈక్రమంలో కొత్త సినిమాలు నిర్మాణ దశలోనే ఉండగా.. మరికొన్ని చిత్రాల విడుదలలు ఆగిపోయాయి. దీంతో ప్రతి ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఆస్కార్​ అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేయాలని నిర్ణయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకను నాలుగు నెలలపాటు వాయిదా వేయాలనే పరిశీలన జరుగుతోందని సినీవర్గాల్లో వినిపిస్తోంది. అలా జరిగితే 93 ఏళ్లలో మొదటిసారి ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అవుతుంది.

ఆస్కార్​ పురస్కారాలను దృష్టిలో ఉంచుకుని హాలీవుడ్​ సినిమాలు నవంబరు, డిసంబరు నెలల్లో ప్రేక్షకుల ముందుకొస్తాయి. భారత్​లో అయితే వేసవిలో అత్యధిక సినిమాలు విడుదలవుతాయి. ఇప్పటికే పలు ఇంగ్లీష్​ చిత్రాలు కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. వాటిలో జేమ్స్​బాండ్​తో పాటు మరికొన్ని సూపర్​హీరోల చిత్రాలూ ఉన్నాయి. ఈ క్రమంలో అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేయమంటూ పలువురు సూచించారని సమాచారం.

ఇదీ చూడండి.. సన్నీ జీవితం ఓ తెరిచిన పుస్తకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.