ETV Bharat / sitara

7 లక్షల వాటర్​ బాటిళ్లు విరాళమిచ్చిన డ్వేన్​ జాన్సన్​

కరోనా పోరాటంలో ఫ్రంట్​లైన్​ వర్కర్లుగా సేవలందిస్తున్నారు డాక్టర్లు, వైద్యసిబ్బంది, పోలీసులు. ఆ వారియర్స్​ కోసం తాజాగా 7 లక్షల మంచి నీళ్ల బాటిళ్లను విరాళం ఇచ్చారు హాలీవుడ్​ నటుడు డ్వేన్​ జాన్సన్​.

covid-19-dwayne-johnson-donates-700000-water-bottles-to-frontline-workers
7 లక్షల మంచినీళ్ల సీసాలు విరాళమిచ్చిన డ్వేన్​ జాన్సన్​
author img

By

Published : Jul 14, 2020, 8:23 PM IST

రెజ్లర్​గా కెరీర్​ ప్రారంభించిన స్టార్​ హీరో అయిన హాలీవుడ్​ నటుడు డ్వేన్​ జాన్సన్​ తన ఉదారతను చాటుకున్నారు. కరోనా సంక్షోభ సమయంలో 7 లక్షల వాటర్​ బాటిళ్లను విరాళం ఇచ్చారు. కరోనా ఫ్రంట్​లైన్​ వారియర్స్​ కోసం తన సొంత సంస్థ 'వోస్​' నుంచి ఈ పనికి శ్రీకారం చుట్టినట్లు ఆయన ఇన్​స్టా వేదికగా స్పష్టం చేశారు.

ఇన్​స్టాలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న సెలబ్రిటీల్లో డ్వేన్​ ఒకరు. సోషల్​ మీడియా మార్కెటింగ్​ సంస్థ హోపర్​ హెచ్​క్యూ ప్రకారం.. 48 ఏళ్ల ఈ నటుడు ఒక్క యాడ్​కు 10 లక్షల డాలర్లకు పైనే తీసుకుంటాడట. అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగానూ గతేడాది ఫోర్బ్స్​ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.