ETV Bharat / sitara

మరో ముగ్గురు నటులకు కరోనా పాజిటివ్

author img

By

Published : Apr 18, 2021, 1:24 PM IST

కరోనా బారిన పడిన నటీనటుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా ముగ్గురు స్టార్స్ దీని బారిన పడ్డారు. అందులో సమీరా రెడ్డి, అధర్వ, అర్జున్ రాంపాల్​ ఉన్నారు.

COVID-19: Arjun Rampal, atharva, sameera reddy tests positive
మరో ముగ్గురు నటులకు కరోనా పాజిటివ్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు దాని బారిన పడ్డారు. ఇప్పుడు మరో ముగ్గురు సినీ తారలకు కొవిడ్‌ సోకింది. తమకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలియజేస్తూ కోలీవుడ్‌ నటుడు ఆధర్వ, నటుడు అర్జున్ రాంపాల్, నటి సమీరా రెడ్డి సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

'కొవిడ్‌ లక్షణాలు స్వల్పంగా కనిపించడం వల్ల వెంటనే వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యులు సూచన మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. కొవిడ్‌ నుంచి కోలుకుని అతి త్వరలో మిమ్మల్ని అలరించేందుకు వస్తానని ఆశిస్తున్నా' అని ఆధర్వ ట్వీట్‌ చేశారు.

'శనివారం నాకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. మేం ఆరోగ్యంగానే ఉన్నాం. దేవుడి దయ వల్ల అత్తయ్యకు నెగెటివ్‌ వచ్చింది. ప్రస్తుతానికి మేం ఇంట్లోనే ఉంటూ తగిన చికిత్స పొందుతున్నాం. మరింత ధైర్యంగా ఉండాల్సిన సమయమిది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి' అని సమీరా రెడ్డి పోస్ట్‌ పెట్టారు.

Arjun Rampal tests positive
అర్జున్ రాంపాల్

మరోవైపు చిత్రపరిశ్రమలో ఇప్పటికే పరేశ్‌ రావల్‌, ఆమిర్‌ఖాన్‌, కార్తిక్‌ ఆర్యన్‌, మాధవన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, భూమి ఫెడ్నేకర్‌, అక్షయ్‌కుమార్‌, విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌, నివేదా థామస్‌, దిల్‌రాజు, పవన్‌కల్యాణ్‌, బండ్ల గణేశ్‌, సోనూసూద్‌ తదితరులు కొవిడ్‌ బారిన పడ్డారు. వీరిలో కొంతమంది కరోనా నుంచి కోలుకున్నారు కూడా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.