తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ముంబయి కోర్టు ఓ కేసుకు సంబంధించి సమన్లు జారీ చేసింది. మార్చి 1న జరిగే విచారణకు కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే సుశాంత్‌సింగ్ మరణం తర్వాత కంగనా ఒక టీవీ షోలో పాల్గొంది. అందులో భాగంగా బాలీవుడ్‌లో ఒక కోటరీ ఉందని, అందువల్ల సినీరంగంలో కొత్తవాళ్లను ఎదగనివ్వరని.. రచయిత జావేద్ అక్తర్ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన జావేద్ అక్తర్.. కంగనాపై పరువునష్టం దావా వేశారు. దీంతో విచారణలో భాగంగా జూహూ పోలీసులు ఆమెను సంప్రదించారు. అయితే కంగనా విచారణకు సహకరించకపోవడం వల్ల జావేద్ ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఆమెకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో పూర్తి నివేదిక తయారుచేసి కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
ఇదీ చూడండి: 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ వాయిదా!