కరోనా ప్రభావం ప్రస్తుతం తీవ్రంగా ఉంది. పలు దేశాల్లో ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నాయి. భారత్‌లో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు జాగ్రత్తలు వహిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకనిర్మాతలు, నటులు మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అవసరమైతే తమ కార్యకలాపాలను వాయిదా వేసుకుంటున్నారు.
ప్రజలకు సూచనలు
పలువురు బాలీవుడ్ నటులు తమ అభిమానులకు, ప్రజలకు కరోనాపై అవగాహన పెంచేందుకు నడుం బిగించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తాము మాస్క్‌లు ధరించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ సూచనలు ఇస్తున్నారు. బాలీవుడ్ కథానాయికలు సన్నిలియోని, పరినితి చోప్రా, సోహా అలీ ఖాన్‌తో పాటు పలువురు ఈ జాబితాలో ఉన్నారు.
బాలీవుడ్ కథానాయిక సన్నీలియోని తన భర్తతో కలిసి ఓ విమానాశ్రయంలో మాస్కులు ధరించి ఫోటో దిగింది. దానికి క్యాప్షన్ జోడించి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది.
"కరోనా పట్ల జాగ్రత్త వహించండి. అస్సలు విస్మరించవద్దు. మీ చుట్టూ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి."
-సన్ని లియోని, కథానాయిక.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"విచారంగా ఉంది. కానీ ముందే ఊహించాను ఈ పరిస్థితి వస్తుందని. జాగ్రత్త వహించండి."
-పరిణితి చోప్రా, కథానాయిక.
-
Sad, but I guess this is the situation now. Stay safe guys. 🤍 #Coronavirus #StaySafe pic.twitter.com/NHAgtMj5H0
— Parineeti Chopra (@ParineetiChopra) February 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Sad, but I guess this is the situation now. Stay safe guys. 🤍 #Coronavirus #StaySafe pic.twitter.com/NHAgtMj5H0
— Parineeti Chopra (@ParineetiChopra) February 10, 2020Sad, but I guess this is the situation now. Stay safe guys. 🤍 #Coronavirus #StaySafe pic.twitter.com/NHAgtMj5H0
— Parineeti Chopra (@ParineetiChopra) February 10, 2020
"పెరిగిపోతున్న కరోనా, వాయు కాలుష్యంలో మాస్క్‌లను తప్పక ధరించండి."
- సోహా అలీ ఖాన్, కథానాయిక.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అవుట్డోర్ షూటింగ్స్
దర్శకనిర్మాతలు తమ అవుట్డోర్ షూటింగ్ లొకేషన్స్ ఎంచుకునేటప్పుడు... ఆ ప్రాంతం కరోనా ప్రభావిత ప్రాంతమా? కాదా? అని పలుమార్లు తనిఖీ చేసుకుంటున్నారు. ఈ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు ముందస్తు జాగ్రత్తగా మాస్క్, శానిటైజర్స్‌ను వినియోగిస్తున్నారు.
ఇదీ చూడండి : ఆ దర్శకుడితో అనుష్క డేటింగ్.. నిజమేనా!