ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురవడం ఖాయమని కోటి ఆశలు పెట్టుకుంది బాలీవుడ్ ఇండస్ట్రీ. కానీ ప్రథమార్ధంలో తీవ్ర నిరాశే ఎదురయ్యింది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు సాధించింది అని చెప్పడానికి ఒక్క చిత్రమూ లేదు. ఏదో అడపాదడపా ఓ మాదిరి విజయాలు దక్కాయంతే. తొలి మూడు నెలలు విజయాలు అంతంతమాత్రంగా నిలిస్తే.. తర్వాత కరోనా దెబ్బకు థియేటర్లే మూతపడ్డాయి. మొత్తానికి తొలి భాగం ఉసూరుమనిపించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మళ్లీ ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే?
తొలి భాగం నిరాశపరిచినా ద్వితీయార్ధం వసూళ్లు బాగుంటాయనుకోవడానికి కూడా ఆస్కారం తక్కువేనని కొందరు సినీ ప్రముఖుల అభిప్రాయపడ్డారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"పరిస్థితులు చక్కబడి, ప్రభుత్వం అనుమతులిచ్చి జులై రెండోవారం తర్వాత థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు రావాలి కదా! వచ్చిన వాళ్లని మెప్పించే సత్తా ఉన్న కథలు ఉండాలి కదా! క్రిస్టోఫర్ నోలెన్ 'టెనెట్', అక్షయ్‌కుమార్ 'సూర్యవంశీ', '83' చిత్రాలు ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్ బాట పట్టించడంలో కీలకంగా నిలుస్తాయి."
- అక్షయ్ రతి, ఎగ్జిబిటర్, డిస్టిబ్యూటర్
2020 తొలి భాగం బాలీవుడ్‌కు నిరాశే ఎదురైంది. ప్రథమార్ధంలో సుమారు రూ.780 కోట్లు(నెట్) వసూళ్లు వచ్చాయి. ఈ వసూళ్లు కూడా హిట్‌గా నిలిచిన 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్' (రూ.280 కోట్లు), 'భాఘీ 3' (రూ.97 కోట్లు), యావరేజ్‌గా నిలిచిన 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' (రూ.63కోట్లు), 'మలంగ్' (రూ.60 కోట్లు) చిత్రాల ద్వారా వచ్చినవే. మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భారీ అంచనాలు.. అంతే నిరాశ
2019 ప్రథమార్ధం బాలీవుడ్‌కు శుభారంభాన్ని ఇచ్చింది. సుమారు రూ.2400 కోట్లు (నెట్) వసూళ్లు దక్కాయి. 'ఉరి:ది సర్జికల్ స్ట్రైక్', 'గల్లీబాయ్', 'కబీర్‌సింగ్', 'కేసరి', 'టోటల్ ధమాల్', 'దే దే ప్యార్ దే' చిత్రాల విజయంతో మంచి వసూళ్లు దక్కాయి. 2018లో ఫస్టాప్‌లో సుమారు రూ.2200కోట్లు (నెట్) కంటే పదిశాతం 2019లో ప్రథమార్ధంలో పెరిగాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
"2018తో పోలిస్తే 2019లో వసూళ్లు పెరిగాయి. దాంతో 2020 ఫస్టాఫ్‌పై ఎంత భారీ అంచనాలు ఏర్పడ్డాయో అంతే స్థాయిలో నిరాశ ఎదురైంది. కరోనా కారణంగా కీలక వేసవి సీజన్‌లో సినిమాలు విడుదల కాకపోవడం వసూళ్లు తగ్గడానికి ప్రధానమైన కారణం".
-తరణ్ ఆదర్శ్, సినీ విశ్లేషకుడు
మెప్పించని పెద్ద చిత్రాలు
భారీ అంచనాల మధ్య విడుదలైన 'స్ట్రీట్ డ్యాన్సర్ త్రీడీ', 'లవ్ ఆజ్‌కల్', 'ఛప్పాక్' మూవీలు ప్లాఫ్ చిత్రాల జాబితాలో చేరిపోవడం ప్రథమార్ధంలో వసూళ్లు మందగించడానికి మరో కారణం అని అంటున్నారు ఓ ప్రముఖ ఎగ్జిబిటర్. గత ఏడాది బాలీవుడ్ కలెక్షన్‌లో హాలీవుడ్ చిత్రాలు అవెంజర్స్: ది ఎండ్ గేమ్’, ‘కెప్టెన్ మార్వెల్’ కీలకంగా నిలిచాయి అంటున్నారు మరో ఎగ్జిబిటర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">