ETV Bharat / sitara

akshay kumar: బెల్​ బాటమ్, సూర్యవంశీ ఓటీటీలోనా? - ఓటీటీ సూర్యవంశీ

కరోనా కారణంగా సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. అక్షయ్ కుమార్ నటించిన 'బెల్ బాటమ్'(bell bottom), 'సూర్యవంశీ'(suryavanshi) రిలీజ్​పై నిర్మాతలు ఆలోచనలోపడ్డారని తెలుస్తోంది. ఓటీటీని కూడా పరిశీలిస్తున్నారట.

akshay kumar
అక్షయ్ కుమార్
author img

By

Published : May 31, 2021, 10:04 AM IST

కరోనా దెబ్బకు ఇప్పటికే చిత్రసీమ చాలా నష్టపోయింది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే పూర్తిగా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. తొలి దశ, రెండో దశ మధ్యలో కాస్త తెగించి కొందరు దర్శకనిర్మాతలు మధ్యలో ఆగిపోయిన తమ సినిమాలను పూర్తి చేశారు. కానీ రెండో వేవ్‌ కారణంగా విడుదల చేయడం చాలా పెద్ద సమస్యగా మారింది. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక చిత్రబృందాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఓ విధంగా చెప్పాలంటే భారీ బడ్జెట్‌ చిత్రాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.

ఈ ఏడాది బాలీవుడ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాల్లో అక్షయ్‌కుమార్‌ నటించిన 'బెల్‌ బాటమ్‌(bell bottom)', 'సూర్యవంశీ'(suryavanshi) ఉన్నాయి. ఈ రెండూ థియేటర్లలో విడుదలైతే ఒకప్పటి వైభవం థియేటర్లకు తిరిగి వస్తుందనే నమ్మకంలో చిత్రసీమ ఉంది. కానీ నెలల తరబడి విడుదల చేయడం కష్టంగా మారిన తప్పనిసరి పరిస్థితుల్లో ఇవీ ఓటీటీ ఆలోచనలో పడ్డాయి.

అన్ని దారులు వెతుకుతున్నారా?

కరోనా తెచ్చిన కష్టం నిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంతో కష్టపడి నిర్మించిన సినిమాలను విడుదల చేసుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. 'బెల్‌ బాటమ్‌' చిత్రానిదీ ఇదే పరిస్థితి. "ఇన్ని రోజులూ థియేటర్‌ కోసమే చూశాం. కానీ క్లిష్ట పరిస్థితులు ఎక్కువ రోజులుగా కొనసాగుతున్నాయి. అందుకే విడుదల కోసం అన్ని దారులు చూస్తున్నాం. హాట్‌స్టార్, అమెజాన్‌ ప్రైమ్‌.. ఈ రెండు ఓటీటీ సంస్థలతోనూ చర్చించాం. వీళ్లకి సినిమాని ప్రదర్శించాం కూడా. వాళ్లకు బాగా నచ్చింది. కానీ నిర్ణయం తీసుకోలేదు" అని 'బెల్‌ బాటమ్‌' చిత్రవర్గాలు చెప్పినట్టు సమాచారం.

ఇంకా డైలామానే!

'బెల్‌ బాటమ్‌'ను నేరుగా అమెజాన్‌లో విడుదల చేసే నిర్ణయం ఇంకా జరగలేదని తెలుస్తోంది. ఇంకా థియేటర్, ఓటీటీ రెండు అవకాశాలను పరిశీలిస్తున్నారట నిర్మాతలు. జూన్‌ నెలాఖరునాటికి కచ్చితంగా ఓ నిర్ణయం తీసుకొని జులైలో ఏ పద్ధతిలో విడుదల చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. జూన్‌ చివరి నాటికి కూడా థియేటర్లు తెరచుకోని పరిస్థితులు ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా ఓటీటీకే వెళదామని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారట.

'సూర్యవంశీ'ది ఇదే సమస్య

కరోనా తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరిచే పరిస్థితి వస్తే వాటి యాజమాన్యాలు ఏం చేయనున్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. అక్షయ్‌కుమార్‌ 'సూర్యవంశీ'(suryavanshi) చిత్రబృందమూ ఓటీటీ దారిని పరిశీలించింది. కరోనా తగ్గి థియేటర్లు తెరచుకుంటే అటువైపు, ఇది ఇప్పట్లో చక్కబడేలా లేదు అనిపిస్తే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే 'సూర్యవంశీ' ఏ దారిలో వెళతాడో చూశాకే 'బెల్‌ బాటమ్‌' చిత్ర బృందం ఓ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది.

ఇవీ చూడండి: అత్యాచారం కేసులో కంగన బాడీగార్డ్​ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.