తమిళ బ్లాక్‌బస్టర్ 'విక్రమ్ వేదా' హిందీ రీమేక్‌కు ఎట్టకేలకు ప్రధాన పాత్రధారులు ఖరారయ్యారు. బాలీవుడ్ స్టార్లు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కాంబినేషన్లో ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ వేదికగా శనివారం వెల్లడించారు.
తమిళంలో 'విక్రమ్ వేదా'ను తెరకెక్కించిన దర్శక ద్వయం పుష్కర్-గాయత్రిలే ఈ రీమేక్‌నూ డైరెక్ట్ చేయనున్నారు. సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబరు 30న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎట్టకేలకు..
'విక్రమ్ వేదా' హిందీ రీమేక్‌ను తొలుత సైఫ్-ఆమిర్‌లతో తెరకెక్కించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో ఆమిర్ తప్పుకోగా, ఆయన స్థానంలో హృతిక్‌ను వేదా పాత్ర పోషించేందుకు తీసుకునట్టు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల హృతిక్ కూడా తప్పుకున్నట్టు ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ ఎట్టకేలకు హృతిక్, సైఫ్ కాంబినేషన్లోనే చిత్రం తెరకెక్కబోతుంది.
ఇదీ చూడండి: మహేష్‌కి విలన్‌గా ప్రముఖ దర్శకుడు