ETV Bharat / sitara

'శివ కార్తికేయన్​ భార్య నన్ను ఎగతాళి చేసింది' - సతీశ్​, శివ కార్తికేయన్​ న్యూస్​

తమిళ అగ్రహీరో శివ కార్తికేయన్​తో తనకున్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు హాస్యనటుడు సతీశ్​. తామిద్దరం మంచి స్నేహితులమని వెల్లడించాడు.

comedian Sathish trolled as Siva Karthikeyan's first wife!
''శివ కార్తికేయన్​ మొదటి భార్య' అని ఎగతాళి చేసింది'
author img

By

Published : Jul 8, 2020, 8:40 PM IST

కోలీవుడ్​లో హాస్యనటుడిగా మంచి గుర్తింపు పొందిన సతీశ్​​.. అగ్రకథానాయకులు విజయ్​, శివ కార్తికేయన్​ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరో శివ కార్తికేయన్​కు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

దర్శకుడు అట్లీ రూపొందించిన 'ముగాపుతగం' లఘుచిత్రం షూటింగ్​లో శివ కార్తికేయన్​తో పరిచయం ఏర్పడినట్లు సతీశ్​ తెలిపాడు. అప్పటివరకు ఒకరికొకరు తెలియకపోయినా.. మొదటి రోజు చిత్రీకరణలోనే మంచి స్నేహితులమయ్యామని వెల్లడించాడు. లవర్స్​ లాగా గంటల తరబడి ఫోన్​లో మాట్లాడుకునేవారని.. ఒకరోజు తాను కాల్​ చేస్తుంటే 'నీ మొదటి భార్య కాల్​ చేస్తుందంటూ' శివ భార్య ఆర్తీ ఎగతాళి చేసిందని చెప్పాడు.

శివ కార్తికేయన్​ నటించిన 'మెరీనా', 'ఎతిర్​ నీచల్​', 'రెమో', 'వెలైక్కరన్​' వంటి చిత్రాల్లో శివ కార్తికేయన్​తో పాటు హస్యనటుడు సతీశ్ నటించాడు​. సూపర్​స్టార్​ రజనీకాంత్​ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'అణ్ణాత్త'లోనూ ఛాన్స్​ కొట్టేశాడు సతీశ్​.

ఇదీ చూడండి... అది నాకు రెండో ఇల్లు లాంటిది: ప్రియాంక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.