యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా మారి గుర్తింపు తెచ్చుకున్న నటి స్వాతి. టాలీవుడ్లో పలు హిట్ చిత్రాల్లో నటించింది. కోలీవుడ్‌లోనూ విభిన్న పాత్రల్లో మెప్పించి ఆకట్టుకుంది. ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత వెండితెరపై కనిపించలేదు.
త్వరలో నిఖిల్ హీరోగా తెరకెక్కనున్న 'కార్తీకేయ' సీక్వెల్లో స్వాతి నటించనుందని సమాచారం. ఈ సినిమా మొదటి భాగంలో వీరిద్దరే జోడిగా కనిపించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నాడు. నాగచైతన్యతో తీసిన గత చిత్రం 'సవ్యసాచి' ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడీ డైరక్టర్.
ఇది చదవండి: 'క్రికెటర్ అర్జున్‌గా నాని అదరగొట్టేశాడు'