ETV Bharat / sitara

''ఆర్ఆర్ఆర్' షూటింగ్​లో అదే పెద్ద ఛాలెంజ్' - RAJAMOULI RRR

'ఆర్ఆర్ఆర్' చిత్ర విశేషాలను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్.. షూటింగ్​లో తనకున్న పెద్ద ఛాలెంజ్​ ఏమిటో చెప్పుకొచ్చారు.

''ఆర్ఆర్ఆర్' షూటింగ్​లో అదే పెద్ద ఛాలెంజ్'
ఆర్ఆర్ఆర్ సినిమా
author img

By

Published : Jun 4, 2020, 6:11 AM IST

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణలోని పెద్ద ఛాలెంజ్​ గురించి చెప్పారు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, దీనితో పాటే పలు విషయాలు పంచుకున్నారు.

RAM CHARAN JR,NTR
హీరోలు రామ్​చరణ్, జూ ఎన్టీఆర్

"చాలామందికి స్వాతంత్ర్యానికి పూర్వం మనదేశం ఎలా ఉందో తెలుసు. దానిని తెరపై ఆవిష్కరించడమనేది నాకున్న అతిపెద్ద ఛాలెంజ్. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు నేను గర్వపడేవి. అయితే బాహుబలి కంటే ఆర్ఆర్ఆర్ కాస్త విభిన్నం. ఎందుకంటే అది కల్పితమైతే, ఇది స్వాతంత్ర్యం రాక ముందు కాలానికి సంబంధించిన కథ. అభిమానులు ఈ సినిమాలో తమ హీరోల అత్యధ్భుత నటనను చూస్తారు" -కె.సెంథిల్ కుమార్, సినిమాటోగ్రాఫర్

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగణ్, సముద్రఖని, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. సుమారు రూ.350 కోట్ల బడ్జెట్​తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.