ETV Bharat / sitara

తెరుచుకోనున్న థియేటర్లు.. ప్రేక్షకులు వస్తారా? - cinema covid

లాక్​డౌన్ తర్వాత సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు రంగం సిద్ధమైంది. అయితే వైరస్ ప్రభావం ఇంకా ఉన్న నేపథ్యంలో మునుపటిలా ప్రేక్షకులు వస్తారా? ఓటీటీకి అలవాటు పడిన వాళ్లు.. మళ్లీ వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తాడా?

Cinemas get ready to open in new COVID normal but with old fare
తెరుచుకోనున్న థియేటర్లు.. ప్రేక్షకులు వస్తారా?
author img

By

Published : Oct 15, 2020, 5:30 AM IST

దాదాపు ఏడు నెలల తర్వాత నేటి(అక్టోబరు 15) నుంచి సినిమాహాళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లలో సీటుకు సీటుకు మధ్య దూరంతో 50 శాతం మంది ప్రేక్షకులను అనుమతించేందుకు కేంద్రం ఇటీవలే పచ్చజెండా ఊపింది. ఈ నేపథ్యంలో మునుపటిగా సినిమా చూసేందుకు వస్తారా అనేది చూడాలి. ఈ క్రమంలోనే కొన్ని రాష్ట్రాల్లో.. గురువారం నుంచి థియేటర్లు తెరుస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో కొన్నిరోజుల వ్యవధిలో వాటిని ఓపెన్ చేయనున్నారు.

సినిమా హాళ్లు/మల్టీప్లెక్స్​లు పాటించాల్సిన నియమాలు:

  1. సీట్లకు మధ్య గ్యాప్​తో 50 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి.
  2. ఆన్​లైన్​లో టికెట్లు విక్రయించేందుకు ప్రాధాన్యం. సింగిల్​ స్క్రీన్​ థియేటర్లలో టికెట్​ కౌంటర్లు తెరిచి ఉంటాయి.
  3. సినిమాకు వచ్చిన వారు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ నడుచుకోవాల్సి ఉంటుంది.
  4. సందర్శకులు, సిబ్బంది లోపలికి వచ్చే ముందు ఎంట్రీ పాయింట్​ వద్ద థర్మల్​ స్క్రీనింగ్​ చేయాలి. ఎలాంటి లక్షణాలు లేని వ్యక్తులనే లోపలికి అనుమతించాలి.
  5. అన్ని ఎంట్రీ, ఎగ్జిట్​ పాయింట్లతో పాటు పనిచేసే ప్రదేశాల్లోనూ శానిటేజర్​ అందుబాటులో ఉంచాలి.
  6. సరైన వెంటిలేషన్​ ఉండేలా థియేటర్​ యాజమాన్యం జాగ్రత్తలు వహించడం సహా ఎయిర్ కండిషనింగ్​ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్​ కంటే ఎక్కువగా ఉండాలి.
  7. మల్టీప్లెక్స్​లలోని వివిధ స్క్రీన్​ల ప్రదర్శనల మధ్య తగిన వ్యవధి ఉండాలి. ఒకే సమయంలో ప్రేక్షకులు బయటకు రాకుండా ప్రణాళికలను రూపొందించి.. ఆ విధంగా ప్రదర్శనలు నిర్వహించాలి.
  8. ప్యాక్​ చేసిన ఆహారం, పానీయాలను మాత్రమే అనుమతించాలి. అన్ని కౌంటర్ల వద్ద ఆన్​లైన్​ చెల్లింపులను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలి.
    Cinemas get ready to open in new COVID normal but with old fare
    సినిమా థియేటర్
  9. థియేటర్​ స్క్రీన్ లోపల ఆహారాన్ని డెలివరీ చేయడం నిషేధం.
  10. ఆరోగ్యసేతు మొబైల్​ యాప్​ వాడాలని సూచించాలి.
  11. విరామ సమయంలో సాధారణ ప్రాంతాలు, లాబీలు, వాష్​రూమ్​లలో రద్దీని నివారించడానికి, వరుస పద్ధతిలో ప్రేక్షకులను అనుమతించడం వంటివి చేయొచ్చు. దాని వల్ల ఎక్కువ విరామ సమయం వెచ్చించాల్సి ఉంటుంది.
  12. ఒక షో పూర్తయ్యాక మరొక షో ప్రదర్శించే ముందు.. సీట్లను తప్పకుండా శానిటైజేషన్​ చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.