ETV Bharat / sitara

'చియాన్​ 60'లో ధృవ్​, విక్రమ్​

author img

By

Published : Dec 6, 2020, 7:25 AM IST

Updated : Dec 6, 2020, 8:01 AM IST

తమిళ హీరో చియాన్​ విక్రమ్​, ఆయన తనయుడు ధృవ్​ కాంబోలో ఓ సినిమా రూపొందనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. కార్తిక్​ సుబ్బరాజ్​ దర్శకత్వం వహిస్తున్నారు.

Chiyan vikram
'చియాన్​ 60'లో ధృవ్​, విక్రమ్​

తండ్రి తనయుల కాంబినేషన్​లో ఎన్నో చిత్రాలు మనల్ని అలరించాయి. ఇప్పుడా జాబితాలో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు తమిళ కథానాయకుడు విక్రమ్​, ఆయన కుమారుడు ధృవ్​. ఈ చిత్రం చియాన్​​ విక్రమ్​కు 60వ చిత్రం. కాగా 'అర్జున్​రెడ్డి' తమిళ వర్షెన్​ 'ఆదిత్య వర్మ'తో ఆకట్టుకున్నాడు ధృవ్​. వీరి కలయికలో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇది సెట్స్​మీదకు వెళ్లనుంది.

Chiyan vikram
'చియాన్​ 60'

ప్రస్తుతం అజయ్​ జ్ఞానముత్తు దర్శకత్వంలో వస్తోన్న థ్రిల్లర్​ చిత్రం 'కొబ్రా'లో విక్రమ్​ నటించనుండగా, దీని షూటింగ్​ వచ్చే ఏడాది జనవరిలో ముగియనుంది. తర్వాత వీరిద్దరూ యాక్షన్​ చిత్రం 'చియాన్​ 60'లో నటించనున్నారు. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. కార్తిక్​ సుబ్బరాజ్​ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సెవన్​ స్క్రీన్​ స్టూడియో నిర్మించనుంది. సంగీత దర్శకుడు అనిరుధ్​ స్వరాలు సమకూర్చనున్నారు.

ఇదీ చూడండి : 'పుష్ప'లో బన్నీ-విక్రమ్​ క్రేజీ కాంబో?

Last Updated : Dec 6, 2020, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.