ETV Bharat / sitara

ఉక్రెయిన్​లోనే ఆంధ్రా వాసి.. చిరు ఎమోషనల్​ ట్వీట్​! - ఉక్రెయిన్​ యుద్ధం

Chiru Tweet For Ukraine Doctor: తాను పెంచుకుంటున్నపెంపుడు జంతువులను వదిలి రాలేక ఉక్రెయిన్​లోనే ఉండిపోయిన ఆంధ్రా వాసి గిరికుమార్ ​కోసం మెగాస్టార్ చిరంజీవి​ ట్వీట్​ చేశారు. మూగజీవాల పట్ల చూపిస్తున్న ప్రేమ, ఆదరణ ప్రశంసనీయమని గిరికుమార్​ను చిరంజీవి కొనియాడారు. యుద్ధం పూర్తయ్యేవరకు జాగ్రత్తగా ఉండమని సూచించారు.

చిరంజీవి
megastar chiranjeevi
author img

By

Published : Mar 10, 2022, 5:15 PM IST

Chiru Tweet For Ukraine Doctor: పెంపుడు జంతువులను వదిలిరాలేక ఉక్రెయిన్‌లోనే ఉండిపోయిన గిరికుమార్‌ అనే ఆంధ్రావాసి కోసం మెగాస్టార్‌ చిరంజీవి ట్వీట్‌ చేశారు. గిరికుమార్‌ జంతుదయకు తన హృదయాన్ని ద్రవింపచేసిందని ఆయన అన్నారు. "డియర్‌ డాక్టర్‌ గిరికుమార్‌ పాటిల్‌. నన్ను స్ఫూర్తిగా తీసుకుని జాగ్వర్‌, పాంథర్‌లను నువ్వు పెంచుకుంటున్నావని తెలిసి నాకెంతో ఆనందంగా అనిపించింది. ప్రస్తుతం ఉన్న భయానక పరిస్థితుల్లో వాటిని వదల్లేక, వాటి సంరక్షణ దృష్టిలో ఉంచుకుని ఉక్రెయిన్‌లోనే ఉండిపోయావని తెలిసి నా హృదయం ద్రవిస్తోంది. మూగజీవాల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ.. ప్రశంసనీయం. ఈ కష్టకాలంలో నువ్వు సురక్షితంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. యుద్ధం త్వరితగతిన ముగిసిపోయి, పరిస్థితులు మరలా సాధారణపరిస్థితులు ఏర్పడేవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు" అని చిరు ట్వీట్‌ చేశారు.

girikumar ukraine
పెంపుడు జంతువులతో గిరికుమార్​

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన గిరికుమార్‌ కొన్నేళ్ల క్రితం మెడిసిన్‌ చదువుకునేందుకు ఉక్రెయిన్‌ వెళ్లారు. కోర్సు పూర్తైన వెంటనే అక్కడే ఓ ఆస్పత్రిలో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. చిరంజీవి అంటే చిన్నప్పటి నుంచి అభిమానించే గిరి.. ఆయన సినిమాలు చూసి స్ఫూర్తి పొంది కొన్నేళ్ల క్రితం బ్లాక్‌ పాంథర్‌, జాగ్వార్‌లను కొనుగోలు చేసి.. పెంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో ఉన్న పరిస్థితుల్లో తన పెంపుడు జంతువులను వదిలి రాలేనంటూ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'అఖండ​' 100 డేస్ ఫంక్షన్​.. 'ఆర్​ఆర్​ఆర్​' ఐమ్యాక్స్ వెర్షన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.