ETV Bharat / sitara

'ఆచార్య' నుంచి త్రిష అందుకే తప్పుకుంది: చిరు - త్రిష

కొన్ని కారణాల వల్ల చిరంజీవి-కొరటాల శివ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు నటి త్రిష ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ విషయంపై తాజాగా మెగాస్టార్​ చిరంజీవి స్పందించాడు.

Chiru reveals actual reason behind Trisha leaving Acharya Movie
మా సినిమా నుంచి త్రిష అందుకే తప్పుకుంది: చిరు
author img

By

Published : Apr 9, 2020, 8:50 PM IST

మెగాస్టార్​ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య' (వర్కింగ్​ టైటిల్​). ఇందులో మొదట హీరోయిన్​గా ఎంపికైన త్రిష.. కొన్ని కారణాల వల్ల తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అయితే ఈ విషయంపై తాజాగా చిరంజీవి స్పందించాడు.

"త్రిష అలా ఎందుకు అందో.. ప్రాజెక్ట్​ నుంచి ఎందుకు తప్పుకుందో నాకు అర్థం కాలేదు. నా కుమార్తె ఆమెకు సంబంధించిన దుస్తులను ఇప్పటికే పంపించింది. ఆమెను ఎవరైనా బాధించారా? అని మా బృందంలోని ప్రతి ఒక్కరిని అడిగాను. మణిరత్నం సినిమాలో అవకాశం రావటం వల్ల మా చిత్రం నుంచి తప్పుకున్నట్టు చివరకు తెలిసింది."

-చిరంజీవి, కథానాయకుడు

త్రిష తప్పుకోవటం వల్ల ఆ​ పాత్రకు కాజల్​ను చిత్రబృందం సంప్రదించగా.. అందుకు ఆమె అంగీకరించింది. కొరటాల దర్శకత్వంలో రామ్​చరణ్​, నిరంజన్​ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి.. నిధి లాక్​డౌన్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.