మెగాస్టార్ చిరంజీవి ఫుల్ జోరు మీదున్నారు. ఒకేసారి నాలుగు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంటూ తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం 'ఆచార్య', 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో జరిగే ఈ సినిమాలో చిరు అండర్ కవర్ పోలీస్‌గా నటిస్తున్నారని సమాచారం. ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్‌కు పండగే. ఎందుకంటే ఈ పాత్ర చేస్తే యాక్షన్ సీన్స్ కచ్చితంగా ఉంటాయి.
'ఆచార్య'లో నక్స్‌లైట్‌గా చేస్తున్న చిరు.. 'గాడ్‌ఫాదర్'లో రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా కనిపిస్తారు. అలానే 'భోళా శంకర్'లో డాన్‌గా నటిస్తున్నారు. ఇలా సినిమా సినిమాకు డిఫరెంట్ వేరియేషన్స్, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాల్లో ఆచార్య.. వచ్చే ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. మిగతా చిత్రాలు కూడా వచ్చే ఏడాది, 2023 ప్రారంభంలో సినీ ప్రేమికుల్ని పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చదవండి: