ETV Bharat / sitara

చిరు చేతుల మీదుగా 'విరాట పర్వం' టీజర్​.. ఎప్పుడంటే - virata parvam

రానా, సాయి పల్లవి నటిస్తున్న 'విరాట పర్వం' చిత్ర టీజర్​ను మార్చి 18న మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేయనున్నారు. రానా నటిస్తున్న మరో చిత్రం 'అరణ్య'లో హృదయమే అనే ఉద్వేగభరిత పాట విడుదలైంది.

chiranjeevi to launch virata parvam teaser on march 18
చిరు చేతుల మీదుగా 'విరాట పర్వం' టీజర్​.. ఎప్పుడంటే
author img

By

Published : Mar 16, 2021, 8:22 PM IST

రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న 'విరాట పర్వం' చిత్ర టీజర్​ను మెగాస్టార్​ చిరంజీవి విడుదల చేయనున్నారు. మార్చి 18న సాయంత్రం 5:04 నిమిషాలకు విడుదలకానుందని చిత్రబృందం దండోరా వేయించింది. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్​ 30న విడుదలకానుంది. ఇందులో నందితాదాస్‌, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

రానా కీలక పాత్రలో నటిస్తున్న మరో చిత్రం.. 'అరణ్య'. ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిందీ సినిమా. ఇందులో నుంచి 'హృదయమే' అనే పాట మంగళవారం విడుదలైంది. 'నిరపరాధినే కదా మరీ నిజానికీ.. నే పరాయివాడనయానులే నీ కంటికీ' అంటూ సాగే పాట ఎంతో హృద్యంగా ఉంది. ఏనుగులు, మనుషులు, ప్రకృతికి మధ్య సంబంధంపై ఈ సినిమాలో ప్రస్తావిస్తున్నట్లు ట్రైలర్​ ద్వారా తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: సైనా బయోపిక్​.. కోర్టులో ఏడ్చేసిన పరిణీతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.