ETV Bharat / sitara

'అఘోరా' పాత్రల్లో స్టార్ హీరోలు.. తెలుగులో కొత్తేం కాదు! - విశ్వక్ సేన్

Tollywood heroes as Aghora: 'అఖండ' చిత్రంలో అఘోరాగా తెరపై బాలయ్య సృష్టించిన విధ్వంసాన్ని అభిమానులు ఇప్పుడప్పుడే మరచిపోలేరు. తమన్ అందించిన సంగీతానికి తోడు బాలయ్య డైలాగులతో థియేటర్లలో మాస్​ జాతర జరుగుతోంది. వారిద్దరూ కలిసి ప్రేక్షకులను 'ఆఘోరా' ట్రాన్స్​లోకి తీసుకెళ్లిపోయారు. అయితే బాలయ్య కన్నా ముందే తెలుగు తెరపై అఘోరా పాత్రల్లో.. మెగాస్టార్ చిరు, నాగార్జున, వెంకీలు నటించారని తెలుసా?

Tollywood heroes as Aghora:
అఖండ
author img

By

Published : Dec 8, 2021, 5:31 PM IST

Tollywood heroes as Aghora: 'శంభో.. శివ శంభో.. హర హర స్వయంభో.. భం అఖండా..' అంటూ పాట వస్తుంటే 70 ఎంఎం స్క్రీన్​పై బాలయ్య సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. తమన్ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​కు అభిమానులు శివాలెత్తిపోయారు. బాలయ్య మాస్​ డైలాగులకు తోడు ఆఘోరా ఆహార్యం తెప్పించిన ఊపు.. ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అంతటి ఇంపాక్ట్​ క్రియేట్​ చేశారు బాలయ్య.. అఘోరా గెటప్​లో!

akhanda movie
'అఖండ'లో బాలయ్య

'అఖండ' సినిమా చూడటానికి ఏకంగా అఘోరాలే థియేటర్లకు వస్తున్నారంటే ఏ రేంజ్​లో బాలయ్య విజృంభించారో అర్థం చేసుకోవచ్చు. అయితే తెలుగు తెరపై అఘోరాలు కొత్తేమి కాదు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి పెద్ద హీరోలతో పాటు పలువురు నటులు అఘోరా పాత్రల్లో నటించి మెప్పించారు. అవి ఏయే సినిమాల్లో అంటే..

akhanda movie
అఘోరాగా బాలయ్య
  • 'శ్రీ మంజునాథ' సినిమాలో శివుడి పాత్రలో నటించారు మెగాస్టార్​ చిరంజీవి. శివుడు భూమికి వచ్చే సందర్భంలో అఘోరా రూపంలో కనిపిస్తారు చిరు.
    sri manjunatha
    చిరంజీవి
  • 'ఢమరుకం'లో నాగార్జున సైతం కొద్దిసేపు అఘోరాగా కనిపించి మెప్పించారు.
    damarukam
    అఘోర గెటప్​లో నాగ్
  • 'నాగవల్లి' సినిమాలో కొన్ని నిమిషాల పాటు అఘోరాగా కనిపిస్తారు వెంకటేశ్. రాజు అఘోరాగా మారడం ఇందులో కనిపిస్తుంది.
    nagavalli movie
    అఘోర పాత్రలో వెంకటేశ్
  • 'అఘోర' అనే సినిమాలో టైటిల్​లో కనిపించారు నటుడు నాగబాబు.
    aghora in telugu
    అఘోర పాత్రలో నాగబాబు
  • ఇక అఘోరా పాత్రకు పూర్తి స్థాయిలో ఫేమ్​ తీసుకొచ్చింది ఒక రకంగా సోనూసూద్​ అని చెప్పాలి. 'అరుంధతి' చిత్రంలో సోనూ పోషించిన పాత్రకు జనం హడలెత్తిపోయారు. ఈ సినిమాతోనే అతడికి తెలుగులో బాగా పేరొచ్చింది.
    arundhati
    'అరుంధతి'లో సోనూసూద్
  • తమిళ హీరో ఆర్య.. నటించిన 'నేను దేవున్ని' సినిమాలో అఘోరా పాత్రలో జీవించాడని చెప్పాలి. బాల తెరకెక్కించిన ఈ చిత్రం కోసం నిజమైన అఘోరాలతో కొన్ని రోజులు ట్రావెల్ చేశాడు ఆర్య.
    nenu devudni telugu
    అఘోరాగా విజృంభించిన ఆర్య
  • మంచు మనోజ్ త్వరలో 'అహం బ్రహ్మస్మి' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో అతడు అఘోరాగా కనిపిస్తాడని సమాచారం.
    aham brahmasmi telugu movie
    'అహం బ్రహ్మస్మి'
  • యువ నటుడు విశ్వక్ సేన్ కూడా అఘోరాగా అలరించనున్నాడు. ఆయన నటిస్తున్న 'గామి' చిత్రంలోని అఘోరా లుక్​ ఇప్పటికే ఆకట్టుకుంటోంది.
    gaami vishwak sen
    'గామి'
    gaami vishwak sen
    'గామి'లో అఘోరాగా విశ్వక్ ​సేన్

ఇదీ చూడండి: అఖండ 'మాస్​ జాతర' కాదు.. అంతకుమించి.. ఇవే సాక్ష్యాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.