ETV Bharat / sitara

ఆ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేశ్​ ఖరారు! - chiranjeevi keerthi suresh

తాను నటించబోయే 'వేదాళం' రీమేక్ సినిమాలో తన చెల్లి పాత్రకు కీర్తిసురేశ్​ను మెగాస్టార్​ చిరంజీవి ఎంపిక చేశారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Chiranjeevi sister as keerthi suresh in vedalam remake
ఆ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తిసురేశ్​ ఖరారు!
author img

By

Published : Oct 27, 2020, 10:45 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మరో సినిమా 'వేదాళం' తెలుగు రీమేక్. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం. ఈ పాత్ర కోసం తొలుత సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ పేరు ప్రచారం సాగింది. అయితే, తాజాగా కీర్తి సురేష్‌ను చిరు ఎంపిక చేశారని తెలిసింది​. దీనిపై చర్చలు కూడా జరిగాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

ఇదీ చూడండి '‌విజయ్​ కుమార్తె గురించి అసభ్యంగా మాట్లాడింది నేనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.