ETV Bharat / sitara

'ఆ సినిమా ఫ్లాప్​తో ఏడ్చేశాను' - chiru

ఎంత కష్టపడినా అప్పుడప్పుడు బ్లాక్​బస్టర్​ హిట్​ తర్వాత ఫ్లాప్​లు సహజం. అలా ఎదురైనా ఓ భారీ పరాజయంతో కన్నీటిపర్యంతం ఆయ్యానని చెప్పారు మెగాస్టార్​ చిరంజీవి.

chiranjeevi says he had cried after the result of veta
ఆ సినిమా ప్లాప్‌తో ఏడ్చేశాను..!
author img

By

Published : Dec 27, 2020, 6:48 PM IST

మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'ఖైదీ' ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి విజయం తర్వాత రాబోయే మరో చిత్రం కూడా అదే స్థాయిలో హిట్‌ అవుతుందని భావించారట చిరు. అదే 'వేట'. కానీ ఫలితం తారుమారైంది. దాంతో బాగా ఏడ్చేశానని ఇటీవలే ఓ కార్యక్రమంలో తెలిపారు మెగాస్టార్.

"వేట' విడుదలయ్యాక బాగా ఏడ్చేశా. 'ఖైదీ' తర్వాత విడుదలైన చిత్రం కావడం వల్ల 'వేట'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కాకపోతే ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఇంట్లో కూర్చొని బాధపడ్డా."

-మెగాస్టార్​ చిరంజీవి

అలాగే, 'విజేత' సినిమా ఎప్పుడు చూసినా తనకు కన్నీళ్లు వచ్చేస్తాయని వివరించారు చిరు. అంతేకాదు తన ఆటోబయోగ్రఫీ రాసి కొందరిలోనైనా స్ఫూర్తి నింపాలని ఉందని వెల్లడించారు.

ఇదీ చూడండి: అమితాబ్​ పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.