Chiranjeevi new movie: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల్ని చేస్తున్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిరు 154వ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సుదీర్ఘంగా ఈ షెడ్యూల్ సాగనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.
![chiranjeevi new movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13802112_chiranjeevi-1.jpg)
Acharya movie: ఇప్పటికే 'ఆచార్య'ను పూర్తి చేసిన చిరంజీవి.. 'గాడ్‌ఫాదర్' కోసం కొన్ని రోజులు చిత్రీకరణలో పాల్గొన్నారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న 'భోళాశంకర్' తొలి షెడ్యూల్ కూడా ఇటీవలే పూర్తయింది.
భోళా.. స్టెప్పు అదిరిపోయేలా
Chiranjeevi Bholashankar movie: మాస్ పాటలో.. అందులోనూ టైటిల్ గీతం అంటే చిరంజీవి స్టెప్పుల్లో జోరు మరో స్థాయిలో ఉంటుంది. 'భోళాశంకర్' టైటిల్ గీతం కోసం మరోసారి ఆయన అదిరిపోయే స్టెప్పులేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి హీరోగా, మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తమన్నా కథానాయిక. చిరుకు చెల్లెలుగా కీర్తిసురేశ్ నటిస్తోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆరంభంలో వచ్చే టైటిల్ గీతాన్ని ఇటీవలే తెరకెక్కించారు. చిరు ఆడిపాడే ఆ పాటకు.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్‌లో రెండు రోజుల కిందటే పాట చిత్రీకరణ పూర్తయిందని సినీ వర్గాలు తెలిపాయి. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
![chiranjeevi movies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13802112_chiranjeevi-2.jpg)
ఇవీ చదవండి: