మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులేస్తే ఆయన అభిమానులు పూనకాలొచ్చినట్లు ఊగిపోతారు. చిరు ఆల్‌టైం బెస్ట్ సాంగ్స్ జాబితాలో తొలి ఐదు స్థానాల్లో నిలుస్తుంది బంగారు కోడిపెట్ట. ఈ పాటకు డిస్కోశాంతితో కలిసి ఆయన వేసిన స్టెప్పులు నాటికీ నేటికీ కుర్రకారును ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.
చిరు ఇదే పాటను అలనాటి అందాల తారలు ఖుష్బు, జయప్రదతో కలిసి చేస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించుకున్నారా?. ఇప్పుడా అపురూప సన్నివేశానికి వేదికైంది మెగాస్టార్ స్వగృహం. డిస్కో లైట్ల మధ్య ఖుష్బుతో చిరు అదరహో అనిపించేలా స్టెప్పులు వేస్తుంటే.. నాగ్, వెంకీ, అమల తదితరులంతా విజిల్స్ వేస్తూ వాళ్లని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఇక చివర్లో జయప్రద కూడా మెగాస్టార్‌తో కలిసి కాలు కదపడం వీడియోకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటీవలే చిరంజీవి తన కొత్త ఇంట్లో 80ల నాటి సూపర్‌స్టార్స్‌తో 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' పేరుతో ఓ గెట్ టు గెదర్ నిర్వహించాడు. ఈ వేడుకలో నాటి నాయకానాయికలు వెంకటేష్, నాగార్జున, సుహాసని, భాగ్యరాజ్, మోహన్‌లాల్, జయప్రద తదితరులంతా హాజరయ్యారు.
-
Stars reunion. #Megastar pic.twitter.com/jigcJC1hr2
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) November 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stars reunion. #Megastar pic.twitter.com/jigcJC1hr2
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) November 29, 2019Stars reunion. #Megastar pic.twitter.com/jigcJC1hr2
— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) November 29, 2019