ETV Bharat / sitara

చిరు 3.0 గురించి మీకు తెలుసా?

author img

By

Published : Aug 22, 2020, 6:33 AM IST

అభిమానుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన నటుడు మెగాస్టార్​ చిరంజీవి.. నేడు 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ ప్రత్యేక కథనం.

chiranjeevi
చిరంజీవి.

చిరు అంటే మెగాస్టార్‌.. గొప్ప యాక్టర్‌.. సూపర్‌ డ్యాన్సర్‌..

మంచి ఫైటర్‌..

ఇదంతా చిరు-1.0

చిరు.. రాజకీయ నాయకుడు.. ప్రజారాజ్యం అధినేత..

ప్రజా ప్రతినిధి.. కేంద్ర మంత్రి

ఇదంతా చిరు-2.0

మరి చిరు-3.0... గురించి తెలుసా? 2020లో కొత్త చిరంజీవిని చూశారా? కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎప్పుడూ మనం చూడని నూతన చిరు కన్పించారు.

సేవ: ఈ విషయంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌తో ఎందరికో ప్రాణాలు పోశారు. పోస్తున్నారు.

కరోనా వచ్చి సినీ పరిశ్రమ మూతపడితే... కరోనా క్రైసిస్‌ చారిటీ మొదలు పెట్టారు. ఎంతో మంది సినీ కార్మికుల కుటుంబాల్లో ఆకలి మంటలు లేకుండా చేశారు.

బాధ్యత : ఓ కళాకారుడి బాధ్యత ఏంటి? సమాజాన్ని చైతన్యం చేయడం.. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎలా వ్యవహరించాలో వీడియోలు చేశారు. మహమ్మారి మన చెంతకు రాకుండా ఉండాలంటే మాస్క్‌ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఆ వీడియోల్లో చెప్పారు. కుటుంబ సభ్యులతోపాటు, ఇతర నటీనటులను ఇందులో భాగస్వాములను చేశారు.

పచ్చని లక్ష్యం : పనుల్లో పడిపోయి, అభివృద్ధి, ఆధునికత పేరుతో ప్రకృతిని ఎంత నాశనం చేశామో.. ఇటీవల అందరికీ తెలిసొచ్చింది. అందుకే గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా లక్ష మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తి చాటారు.

ట్రెండు: చిరు అప్పుడే కాదు.. ఇప్పుడూ ట్రెండే. నేటి తరాన్ని అందిపుచ్చుకున్న ఆయన సోషల్‌మీడియాలో ఎంత యాక్టివ్‌గా మారారో చూస్తూనే ఉన్నాం. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కరోనా యోధులను ప్రోత్సహించడానికి దీపాలు వెలిగించారు. చప్పట్లు కొట్టి వాళ్లను ప్రోత్సహించారు. ఇంట్లో అమ్మకు వంట చేసి పెడుతూ, ఇంటి పనిలో ఇల్లాలికి సాయం చేస్తూ... ఎందరిలోనూ స్ఫూర్తి నింపారు.

శనివారానికి 65 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న చిరంజీవి-3.0ని చూశారుగా!

"ధైర్యంగా ఉండండి. మళ్లీ మనమంతా కలిసి హాయిగా పనిచేసుకుంటూ, ఆనందంగా గడిపే రోజులు దగ్గర్లోనే వస్తాయి. ఎవరూ డీలా పడొద్దు. సినీ పరిశ్రమపై ఆధారపడిన దాదాపు 10వేల మంది కార్మికులకు సీసీసీ ద్వారా మూడో విడత సాయం అందిస్తున్నాం. మహమ్మారి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ.. కుటుంబాలకు రక్షణలా నిలవండి."

- చిరంజీవి

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు చిరంజీవి.

ఇది చూడండి చిరు బర్త్​డే: 'పునాదిరాళ్లు' నుంచి ఏమాత్రం తగ్గని 'మెగా' జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.