టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి విషయంలోనూ వీరిద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలవడం మనం చాలాసార్లు చూశాం. తాజాగా వీరి స్నేహం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం 'వైల్డ్ డాగ్' సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్న నాగార్జునను ఇంటికి పిలిచారు చిరంజీవి. వీరిద్దరూ సరదాగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో నాగ్ కోసం స్వయంగా వంట చేశారు చిరు. ఈ విషయాన్ని నాగ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.
"వైల్డ్ డాగ్' విడుదల నేపథ్యంలో నా ఒత్తిడి తగ్గించేందుకు మెగాస్టార్ స్వయంగా వంట చేశారు. రుచికరమైన విందుని ఏర్పాటు చేశారు. ఈ అద్భుతమైన సాయంత్ర విందుకు ధన్యవాదాలు" అంటూ నాగ్ ట్వీట్ చేశారు. ఇందులో నాగ్ ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఈ ఫొటొ చిరంజీవి సతీమణి సురేఖ తీసినట్లుగా వెల్లడించారు నాగ్.
-
A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021A delicious dinner Cooked by the megastar himself to cool my nerves for #WildDog release tomorrow !! Thank you For a wonderful evening @KChiruTweets 🙏 picture courtesy Surekha garu 😊 pic.twitter.com/86FO5aWI1Q
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 1, 2021
నాగార్జున హీరోగా అహిసోర్ సాల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వైల్డ్‌డాగ్'. ఈ మూవీ నేడు (శుక్రవారం) విడుదల కానుంది.