తెలుగులో మల్టీస్టారర్ సినిమాలకు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అలనాటి ఎన్టీఆర్- ఏఎన్నార్ నుంచి ఇప్పటి జూ.ఎన్టీఆర్- రామ్‌చరణ్ వరకు.. ఎప్పుడు మల్టీస్టారర్ సినిమా వచ్చినా.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలిసి తెరను పంచుకోనున్నారని సమాచారం. తమిళ బ్లాక్‌బస్టర్ 'విక్రమ్ వేదా' తెలుగు రీమేక్‌లో(Vikram Vedha Telugu Remake) నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇదే నిజమైతే.. తెలుగులో మరో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం ఇదే అవుతుంది! మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఈ సూపర్‌హిట్ చిత్రాన్ని హిందీలో రిమేక్ చేస్తున్నారు. స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'(Acharya Movie Release Date) ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు గాడ్‌ఫాదర్, 'భోళాశంకర్', బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చిరు చేస్తున్నారు. నాగార్జున ప్రస్తుతం 'బంగార్రాజు', 'ది ఘోస్ట్' చిత్రాలతో బిజీగా ఉన్నారు.
ఇదీ చదవండి: ఈ రోజు నేను అస్సలు మర్చిపోలేను: చిరంజీవి