ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా భారత్‌లోనూ తన ప్రతాపాన్ని చూపిస్తోంది. టాలీవుడ్‌నూ అతలాకుతలం చేసింది. రోజువారీ చిత్రీకరణలు నిలిచిపోయినందున సినీ కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో 'కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)' ఏర్పాటైంది. దీని కోసం సినీ వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. చిత్రపరిశ్రమ నుంచి మంచి స్పందనే వస్తోంది.
ప్రజల్ని భాగస్వాముల్ని చేస్తూ
కరోనాపై మరింత అవగాహన కల్పించేలా సంగీత దర్శకుడు కోటి ఓ పాటను స్వరపరిచి ఆలపించారు. అందులో అగ్రహీరోలైన చిరంజీవి, నాగార్జునతోపాటు యువ కథానాయకులు వరుణ్‌తేజ్, సాయితేజ్ పాలుపంచుకున్నారు. ఈ వైరస్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ.. దాని నిర్మూలనకు చేయాల్సిన కృషిని తెలిపేలా ఈ పాటను తెరకెక్కించారు. ఇందులో ప్రజలనూ భాగస్వామ్యుల్ని చేశారు. ఈ పాటను పాడి, రికార్డు చేసి ఆ వీడియో పంపమని నెటిజన్లను ట్విట్టర్‌లో కోరాడు చిరంజీవి. అలా పంపిన వాటిని ఎడిట్ చేసి వీడియోలో జోడిస్తామని అన్నాడు.
వీడియోలు పంపాల్సిన మెయిల్ ఐడీ: creatives4ccc@gmail.com
ఇదీ చదవండి: రాశీఖన్నా పాడుతుంటే నిద్రపోయిన మెగాహీరో