మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'ఆచార్య' సినిమా వాయిదా పడింది. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ చిత్రబృందం ఈ విషయాన్ని ట్వీట్ చేసింది.
అనుకున్న దాని ప్రకారం ఫిబ్రవరి 4న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాలేకపోతున్నామని నిర్మాణ సంస్థలు వెల్లడించాయి. కరోనా పరిస్థితుల దృష్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశాయి. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు.
దేవాలయాల నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా చేసింది. రామ్చరణ్, పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పాటలు, టీజర్లు మెగా అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేశాయి. ఇప్పుడు చిత్ర బృందం విడుదల వాయిదా వేయడం వల్ల అభిమానుల్లో నిరాశ నెలకొంది.
మరోవైపు పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లానాయక్' కూడా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కొవిడ్ పరిస్థితి ఇలాగే కొనసాగితే 'భీమ్లానాయక్' కూడా మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి:
- Chiranjeevi: రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలపై స్పందించిన చిరంజీవి
- ఇండస్ట్రీ పెద్దగా ఉండను కానీ..: హీరో చిరంజీవి
- Chiranjeevi: 'సినీ పరిశ్రమ సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయని భావిస్తున్నాం'
- చిరు- బాలయ్య మల్టీస్టారర్.. 'మైత్రీ' ప్రొడ్యూసర్స్ క్లారిటీ!
- భోగి స్పెషల్.. ఇది మెగాస్టార్ చిరంజీవి దోశ
- చిరు కొత్త సినిమాలో రవితేజ గెస్ట్ రోల్ కన్ఫర్మ్!
- చిరంజీవి కోసమే 'సానా కష్టం..' పాట చేశా: రెజీనా
- Chiru 154 movie: చిరుకు జోడీగా శ్రుతిహాసన్?