కరోనా మహమ్మారి.. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరీమ్ మొరానీ కుమార్తె షాజా మొరానీకి ఈ వైరస్ సోకడం తాజాగా కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం జరిపిన వైద్యపరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కరీమ్ స్వయంగా వెల్లడించారు.
"షాజాకు కరోనా లక్షణాలు ఏం కనిపించలేదు కానీ పాజిటివ్‌గా తేలింది. మరో కుమార్తె జోయాకు పరీక్షలు జరిపాం. అయితే ఆమెకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. షాజా.. మార్చి తొలివారంలో శ్రీలంక నుంచి, జోయా.. మార్చి 15న రాజస్థాన్ నుంచి వచ్చారు" -కరీమ్ మొరానీ, బాలీవుడ్ నిర్మాత
కరీమ్.. బాలీవుడ్ బాద్షా షారుక్‌కు ఆప్తుడు. అతడితో 'రావన్', 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'హ్యాపీ న్యూయర్', 'దిల్వాలే' సినిమాలను నిర్మించారు.
భారత్‌లో ప్రస్తుతం 4067 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 109 మంది మృత్యువాతపడ్డారు.