ప్రస్తుతం హవా అంతా సోషల్‌మీడియాదే. మనకు ఏది కావాలన్నా ఆధారమదే. దాచుకోలేనంతా సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అలాంటప్పుడు ఏ అంశం గురించి అయినా అన్వేషించాలంటే హ్యాష్‌ట్యాగ్ సహాయం చేస్తుంది. హ్యాష్‌ట్యాగ్ డే సందర్భంగా టాప్ 5 హ్యాష్‌ట్యాగ్స్ జాబితా విడుదల చేసింది ట్విట్టర్.
![Check out all the hashtags with the maximum number of tweets!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4222823_has-tags.jpg)
2019 జూన్ వరకు బాగా పాపులరైన అంశాలను పరిగణలోనికి తీసుకుని వాటిని ప్రకటించింది ట్విట్టర్. ఇందులో తమిళ సినిమా, ఓ తెలుగు సినిమా ఉండటం విశేషం. తొలిస్థానంలో ప్రముఖ నటుడు అజిత్ నటించిన ‘విశ్వాసం' నిలిచింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ట్యాగ్స్‌ను దాటి 'విశ్వాసం' టాప్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. రెండో స్థానంలో లోక్ సభ ఎన్నికలు, మూడో స్థానంలో క్రికెట్ వరల్డ్ కప్, నాలుగో స్థానంలో 'మహర్షి', ’ ఐదో స్థానంలో 'న్యూ ప్రొఫైల్ పిక్' అనే హ్యాష్‌ట్యాగ్స్ ఉన్నాయి.
‘విశ్వాసం’ టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి ట్విట్టర్లో ఈ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అందుకే హ్యాష్‌ట్యాగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
ఇది చదవండి: 5చోట్ల 'వంద' కొట్టిన మహేశ్‌బాబు 'మహర్షి'