ETV Bharat / sitara

పెళ్లికి ముందే శుభవార్త చెప్పేశారు! - Konkona Sen Sharma news

కొందరు సెలిబ్రిటీలు.. పెళ్లికి ముందే తల్లిదండ్రులు కాబోతున్నామని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇంతకీ వారెవరు? ఎప్పుడు చెప్పారు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

పెళ్లికి ముందే మనకు శుభవార్త చెప్పేశారు!
హార్దిక్ నటాషా
author img

By

Published : Jun 15, 2020, 7:21 PM IST

రెండు హృదయాలను కలిపే అందమైన బంధం ప్రేమ. పెళ్లితో అది నిండు నూరేళ్ల అనుబంధమవుతుంది. అలాంటి బంధం సంపూర్ణమయ్యేది ఎప్పుడు అంటే ఇద్దరు ముగ్గురైనప్పుడే!. పెళ్లయ్యాకే మహిళలు గర్భం దాల్చడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం.. మన దేశ సంప్రదాయం. అయితే రానురానూ పాశ్చాత్య పోకడలు మన దేశం జనజీవనంపై ప్రభావం చూపడం, ఇతర దేశాలకు చెందిన సినీ తారలు ఇక్కడి అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లికి ముందే గర్భం ధరించడం ఈరోజుల్లో సాధారణమైపోయింది. ఇందుకు తాజా ఉదాహరణ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య ప్రియురాలు, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌. ఈ ఏడాది తొలి రోజే ఉంగరాలు మార్చుకుని తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టిన ఈ ముద్దుల జంట.. తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామని ఇటీవలే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే నటాషానే కాదు.. గతంలోనూ కొందరు ముద్దుగుమ్మలు పెళ్లికి ముందే గర్భం ధరించి వార్తల్లో నిలిచారు. ఆపై వివాహబంధంతో తమ అనుబంధాన్ని శాశ్వతం చేసుకున్నారు. వారి గురించే ఈ కథనం.

నటాషా స్టాంకోవిచ్‌

ఈ ఏడాది మనందరికీ సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లిస్తున్నాడు డ్యాషింగ్‌ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య. కొత్త సంవత్సరం మొదటి రోజునే తన ప్రేయసి, సెర్బియన్‌ నటి నటాషా స్టాంకోవిచ్‌ను ప్రేమికురాలిగా పరిచయం చేశాడు. అదే రోజు సముద్ర జలాల సాక్షిగా తన ఇష్టసఖి వేలికి ఉంగరం తొడిగి బంధాన్ని బలోపేతం చేసుకున్నాడు. ఆపై తాను త్వరలో తండ్రిని కాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించి మరోసారి షాకిచ్చాడు. ఈ సందర్భంగా గర్భంతో ఉన్న నటాషాతో దిగిన ఓ అందమైన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.

natasha with hardik
ప్రేయసి నటాషాతో క్రికెటర్ హార్దిక్ పాండ్య

"నటాషాతో కలిసి నా ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. త్వరలో మా ప్రయాణం మరింత అపురూపంగా మారనుంది. మా ఇద్దరి జీవితాల్లోకి మరో చిన్నారి రాబోతోంది. మా బుజ్జాయికి ఆహ్వానం పలికేందుకు మేమెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం. అందుకోసం మీ ఆశీర్వాదాలు, దీవెనలు మాకు కావాలి" అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు హార్దిక్. ఇదే ఫొటోను నటాషా తన ఇన్‌స్టాలో పంచుకుని, అందరి ఆశీర్వాదాలు కావాలంటూ కోరింది. ఇదే పోస్టులో మరో ఫొటోలో సంప్రదాయ దుస్తులు ధరించి మెరిసిపోయారీ లవ్లీ కపుల్‌. అయితే వీరిద్దరూ పూల దండలు వేసుకొని ఉండడం వల్ల ఈ లాక్‌డౌన్‌లో సింపుల్‌గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఈ విషయాన్ని ఈ క్యూట్‌ కపుల్‌ గానీ, వారి కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ప్రకటించలేదు.

కల్కి కొచ్లిన్‌

'మార్గరిటా విత్‌ ఏ స్ట్రా' సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకోవడం సహా జ్యూరీ విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది బాలీవుడ్‌ బ్యూటీ కల్కి కొచ్లిన్‌. తన జీవితంలో జరిగే ఏ విషయాన్నైనా సూటిగా, నిర్భయంగా చెప్పే ఈ బోల్డ్‌ నటి.. తన ప్రేమ విషయాన్ని, ఆపై తాను పెళ్లికి ముందే తల్లిని కాబోతున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇజ్రాయిల్‌కు చెందిన పియానిస్ట్‌ గై హెర్ష్‌బెర్గ్‌తో మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్నానని గతేడాది సెప్టెంబర్‌లో బయటపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తాను తల్లిని కాబోతున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా పంచుకుని ఆశ్చర్యపరిచింది. "ప్రెగ్నెన్సీ అనేది వివిధ అనుభవాల, అనుభూతుల సమ్మేళనం. ఇది నా ఇష్టాయిష్టాలేంటో నాకు తెలియజేస్తుంది. ఈ సమయంలో నేను నాకు ఇష్టమైన సినిమాలు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నా. అప్పుడప్పుడూ నా నిర్ణయాలు కూడా మారిపోతున్నాయి.. ఇది నాకెంతో క్రేజీగా అనిపిస్తోంది" అంటూ తన అనుభవాలను అందరితో పంచుకుందీ సుందరి.

kalki kochlin
నటి కల్కి కొచ్లిన్

ఆపై ఎప్పటికప్పుడు గర్భిణిగా తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. తాను పాల్గొన్న ఫొటోషూట్స్‌ ఫొటోలను, ఈ సమయంలో తన డైట్‌, ఫిట్‌నెస్‌ టిప్స్‌.. వంటివన్నీ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ తొమ్మిది నెలల్లోనే అమ్మతనంలోని మాధుర్యమేంటో తెలిసిందంటూ చెప్పకనే చెప్పిందీ సుందరి.

ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 7న 'సఫో' అనే పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన కల్కి.. తన చిన్నారికి సంబంధించిన ప్రతి క్షణాన్నీ ఫొటోలో బంధించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. అయితే 2011లో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌తో పెళ్లి పీటలెక్కిన కల్కి.. 2015లో ఆయనతో విడిపోయింది.

గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌

బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో అర్జున్‌ రాంపాల్‌.. దక్షిణాఫ్రికాకు చెందిన మోడల్‌, నటి అయిన గ్యాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరి అనుబంధానికి గుర్తుగా గతేడాది జులైలో పండంటి కొడుకు పుట్టాడు. అయితే గ్యాబ్రియెల్లా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని అర్జున్‌ అప్పట్లో సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ మురిసిపోయాడు.

arjun rampal
ప్రేయసితో అర్జున్ రాంపాల్

గర్భిణిగా ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ గ్యాబ్రియెల్లాను ప్రేమగా గుండెలకు హత్తుకున్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్న ఈ కండల వీరుడు.. "నీతో కలిసి తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించినందుకు చాలా హ్యాపీగా ఉంది.. త్వరలో ఓ బుజ్జి బేబీకి జన్మనివ్వబోతున్న ఈ బేబీకి థ్యాంక్యూ..!" అంటూ తన ప్రేయసిపై ఉన్న ప్రేమనంతా రంగరించి స్వీట్‌ న్యూస్‌ చెప్పాడీ బాలీవుడ్‌ హీరో. ఇక ఇప్పుడు తమ కొడుకుతో గడుపుతూ ఆ మధురానుభూతులను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారీ లవ్లీ కపుల్‌.

అయితే అర్జున్‌ 1998లోనే మోడల్‌ మెహర్‌ జెస్సియాను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు మహిక, మైరా.. అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వివిధ కారణాలరిత్యా రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకుందీ జంట.

అమీ జాక్సన్‌

'పూలనే కునుకేయమంటా.. తను వచ్చెనంటా..' అంటూ తన అందచందాలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బ్రిటిష్‌ బ్యూటీ అమీ జాక్సన్‌. 'ఎవడు', 'ఐ', 'రోబో 2.0' చిత్రాల్లో నటించి భారతీయ సినీ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఈ ముద్దుగుమ్మ కూడా పెళ్లికి ముందే గర్భం ధరించి తన ఫ్యాన్స్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్రిటన్‌ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటోతో కొంత కాలంగా డేటింగ్‌ చేస్తోన్న అమీ.. బ్రిటన్‌లో మాతృ దినోత్సవం (మార్చి 31న) సందర్భంగా గతేడాది ఈ స్వీట్‌ న్యూస్‌ను సోషల్‌ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది.

amy jackson
భర్తతో నటి అమీ జాక్సన్

ఓ సాయంత్రం సూర్యాస్తమయ వేళ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ తన నుదుటిపై ప్రేమగా ముద్దుపెడుతుండగా క్లిక్‌మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్న ఈ భామ.. "నేను గర్భం ధరించానన్న విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఈ రోజు మాతృ దినోత్సవం. ఈ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం ఇంకేముంటుంది..! నేను ప్రస్తుతం గర్భవతినన్న విషయం తెలియజేయడానికి రూఫ్‌టాప్‌ పైకి ఎక్కి గట్టిగా అరవాలన్నంత ఆనందంగా ఉంది నాకు! ఈ ప్రపంచంలో అన్నింటికంటే నువ్వే నాకు ఎక్కువ. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆత్రుతతో నా మనసంతా నిండిపోయింది. అమ్మ ప్రేమే ఈ సృష్టిలో స్వచ్ఛమైనది.. నిజమైనది.." అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చిందీ బ్రిటిష్‌ సుందరి.

ఇలా తాము త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన కొన్ని రోజులకు ఈ ముద్దుల జంట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్‌లో ఆండ్రియాస్‌ అనే ముద్దుల బాబుకు జన్మనిచ్చిన ఈ బ్యూటీ.. అప్పటి నుంచి తన చిన్నారి ఆలనా పాలనలోనే మునిగితేలుతోంది. ఈ క్రమంలో తన బాబుతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటోందీ అమీ.

కొంకణ్ సేన్‌ శర్మ

విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్‌ అందాల తార కొంకణ్ సేన్‌ శర్మ. 2007లో నటుడు రణ్‌వీర్‌ షోరేతో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అతనిని రహస్యంగా పెళ్లి చేసుకోవడం, ఆరు నెలలకే వీరికి కొడుకు పుట్టడం వల్ల.. కొంకణ్ పెళ్లికి ముందే గర్భం ధరించినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయినా ఈ విషయం గురించి బయటపెట్టడానికి ఇష్టపడలేదీ జంట. అయితే 2015లోనే విడిపోయిన ఈ కపుల్‌.. ఈ ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా విడాకుల కోసం అప్లై చేసుకోవడం వల్ల మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

konkansen sharma
కొంకణ్ సేన్ శర్మ

వీరు కూడా!

  1. బాలీవుడ్‌ నటీనటులు నేహా ధుపియా-అంగద్‌ బేడీలు కొన్నాళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆపై 2018, మే 10న రహస్యంగా వివాహం చేసుకోవడం, అదే ఏడాది నవంబర్‌ 18న ఈ జంటకు పాపాయి పుట్టడం వల్ల.. పెళ్లికి ముందే నేహ గర్భం దాల్చిందన్న వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
  2. బాలీవుడ్‌ నటి అమృతా అరోరా కూడా షకీల్‌ లడక్‌తో తన పెళ్లి విషయాన్ని సడన్‌గా బయటపెట్టి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ఆపై కొన్నాళ్లకు తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నామని ప్రకటించే సరికి.. అమృత గర్భం ధరించడం వల్లే వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ అందరూ అనుకున్నారు. ప్రస్తుతం ఈ జంటకు అజాన్‌, రయాన్‌ అనే ఇద్దరు కొడుకులున్నారు.
  3. బోనీని పెళ్లి చేసుకునే నాటికి శ్రీదేవి ఏడు నెలల గర్భిణి. పెళ్లికి ముందే తమ ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టిన అతి కొద్ది మంది నాయికల్లో శ్రీ ఒకరు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌లు వీరి ప్రేమకు ప్రతిరూపాలు.
  4. వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్‌ చేసిన అలనాటి అందాల తార నీనా గుప్తా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. అయితే తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి నిరాకరించిన వివియన్‌కు దూరమైన నీనా.. తన కూతురు మసాబా గుప్తాను సింగిల్‌ మదర్‌గానే పెంచాలనుకుంది. ఇప్పుడు మసాబా దేశంలోనే పేరు మోసిన ఫ్యాషన్‌ డిజైనర్‌.
  5. కమల్‌ హాసన్‌-సారికల ప్రేమాయణానికి గుర్తుగా శృతి హాసన్‌ పుట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు (1988లో) పెళ్లి పీటలెక్కిందీ జంట. పెళ్లి తర్వాత వీరికి అక్షరా హాసన్‌ జన్మించింది. 2004లో కమల్‌-సారికలు విడాకులు తీసుకున్నారు.
    sruthi with sarika
    తల్లి సారికతో శ్రుతిహాసన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.