ETV Bharat / sitara

కుక్కకు పిజ్జాలు తినిపిస్తూ.. గో కరోనా గో అంటూ - anjali dog

ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న చాలా మంది సినీ ప్రముఖులు.. తమకిష్టమైన వ్యాపకాలతో సేదతీరుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

కుక్కకు పిజ్జాలు తినిపిస్తూ.. గో కరోనా గో అంటూ
ప్రణీత అంజలి ప్రదీప్
author img

By

Published : Mar 29, 2020, 3:28 PM IST

Updated : Mar 29, 2020, 3:56 PM IST

క్వారంటైన్​లో సెలబ్రిటీలు వ్యాపకాలు

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమయ్యారు పలువురు సినీ ప్రముఖులు. ప్రస్తుతం వారికిష్టమైన వ్యాపకాల్లో మునిగితేలుతున్నారు. ఈ జాబితాలో నటి, ఎమ్మెల్యే రోజా, యాంకర్ ప్రదీప్, నటుడు ప్రకాశ్​రాజ్, హీరోయిన్లు పాయల్ రాజ్​పుత్, ప్రణీత, అంజలి, రుహనీ శర్మ తదితరులు ఉన్నారు.

సినీనటి, ఎమ్మెల్యే రోజా... తన పిల్లల కోసం చికెన్ వండుతూ కాలక్షేపం చేస్తున్నారు. టీవీ వ్యాఖ్యత, నటుడు ప్రదీప్ మాచిరాజు.. బెండకాయ వేపుడు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తన వ్యవసాయ క్షేత్రంలో కుమారుడికి జాతీయ గీతాన్ని నేర్పిస్తూ సేదతీరుతున్నాడు.

హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్.. ఇంట్లో వంటపాత్రలు శుభ్రం చేస్తూ 'గో కరోనా గో' అంటూ నినాదాలు చేస్తోంది. మరో భామ ప్రణీత... తన పెంపుడు కుక్కకు పిజ్జాలు తినిపిస్తూ సరదాగా గడుపుతోంది. 'హిట్' సినిమాతో విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ రుహాని శర్మ.. పుస్తకాలు చదువుతుండగా... నటి అంజలి, పెంపుడు కుక్కపిల్లతో సేదతీరుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.

ఇలా చాల మంది సినీప్రముఖులు ఇన్నాళ్లు దూరమైన వాటన్నింటిని దగ్గర చేసుకుంటూ హోమ్ క్వారంటైన్ సమయాన్ని హాయిగా, ఆహ్లాదకరంగా గడుపుతూ కరోనా వ్యాప్తి నిరోధానికి తమవంతు కృషి చేస్తున్నారు.

Last Updated : Mar 29, 2020, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.