ETV Bharat / sitara

ప్రముఖ దర్శకుడిపై కేసు నమోదు - బాలీవుడ్​ లేటేస్ట్ న్యూస్​

Mahesh Manjrekar: Mahesh Manjrekar case: బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్​ మంజ్రేకర్​కు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

Mahesh Manjrekar
Mahesh Manjrekar
author img

By

Published : Feb 26, 2022, 2:37 PM IST

Mahesh Manjrekar case: బాలీవుడ్​ ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్​ మంజ్రేకర్​పై కేసు నమోదైంది. ఆయన తెరకెక్కించిన ఓ సినిమాలో పిల్లలపై అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటమే ఇందుకు కారణం.

ఇటీవల మహేశ్​ మంజ్రేకర్​ 'నయ్​ వరణ్​ భట్​ లోంచా కోన్​ నై కొంచా' అనే ఓ మరాఠి సినిమా తీశారు. ఈ మూవీలోని సన్నివేశాలను ఎక్కువగా పిల్లలపైనే చిత్రీకరించారు. వారిపై జరిగే అకృత్యాలు, వాళ్లను బానిసలుగా చూపే అంశాలపైనే ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

అయితే ఈ సినిమాలో సీన్స్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ్​ దేశ్​ పాండే.. మహేశ్​పై కేసు పెట్టారు. చిత్రంలో నటించిన పిల్లలంతా మైనర్లు అని, వారిపై అలాంటి దృశ్యాలు చిత్రీకరించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు.

చుక్కెదురు

అయితే దీనిపై ముంబయి హైకోర్టును ఆశ్రయించారు మహేశ్. తనను అరెస్ట్​ చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషన్​ దాఖలు చేశారు. అయితే తాజాగా విచారించిన కోర్టు.. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 28కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: బాక్సాఫీస్​పై 'భీమ్లానాయక్​' దండయాత్ర.. నైజాంలో ఆల్​టైం రికార్డ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.