'బంటీ ఔర్ బబ్లీ' సినిమాకు కొనసాగింపుగా బాలీవుడ్లో ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే కొంత భాగాన్ని చిత్రీకరించారు. దీనిని తిరిగి ఆగస్టులో మొదలుపెట్టాలని భావిస్తున్నారు. వరుణ్ వి.శర్మ దర్శకత్వం వహిస్తుండగా, ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా షూటింగ్‌ను మొదలుపెట్టి, ముందుగా ఓ పాటను కొద్దిమందితోనే పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ సీనియర్ బంటీగా, రాణీ ముఖర్జీ బబ్లీ సీనియర్‌గా నటిస్తున్నారు. సిద్ధాంత్, శార్వారి వాగ్‌లు బబ్లీ జూనియర్స్ పాత్రల్లో కనిపించనున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కరోనా ప్రభావంతో చిత్రీకరణ పూర్తవక అది కాస్త ఆలస్యమైంది.