బాలీవుడ్ దర్శకుడు సజీత్ సర్కార్ దర్శకత్వంలో రూపుదిద్దుకునే 'సర్దార్ ఉద్ధమ్ సింగ్' చిత్రంలో పంజాబి సంతతికి చెందిన బ్రిటన్ నటి 'బనితా సంధూ' అవకాశం దక్కించుకుంది. 'ఉరి' సినిమా ఫేమ్ హీరో విక్కీ కౌశల్ ఈ మూవీలో కథానాయకుడు. సుజీత్ సర్కార్ డైరెక్షన్లో ఇంతకుముందు 'అక్టోబర్' సినిమాలో వరుణ్ ధావన్‌కి జంటగా నటించింది సంధూ. ఈ చిత్రంతోనే తన ఎంట్రీ జరిగింది. ఇప్పుడు మరోసారి సర్కార్ దర్శకత్వంలో నటించనుంది.
సర్దార్ ఉద్ధమ్ సింగ్' జీవితాధారంగా వస్తున్న చిత్రంలో చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పటికే కొన్ని సన్నివేశాలను పంజాబ్ ప్రాంతంలో చిత్రీకరించారు. మరోసారి 'అక్టోబర్' చిత్రబృందంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.
-బనితా సంధూ, సినీ నటి
ఇప్పటికే సంధూ తమిళంలో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో కలిసి 'ఆదిత్య వర్మ'లో నటించింది. ఇది తెలుగులో వచ్చిన 'అర్జున్‌రెడ్డి' సినిమాకు రీమేక్. గిరీసాయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది కూడా చదవండి:హైదరాబాద్ దాదాలపై వర్మ సినిమా