ETV Bharat / sitara

రూ.300 కోట్లు దాటిన బ్రహ్మాస్త్ర బడ్జెట్! - బ్రహ్మాస్త్ర మూవీ బడ్జెట్ వార్తలు

భారతీయ సినీపరిశ్రమ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్​తో 'బ్రహ్మాస్త్ర' చిత్రం తెరకెక్కనుందని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయంపై స్టార్​ అండ్​ డిస్నీ ఇండియా ఛైర్మన్​ ఉదయ్​ శంకర్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రూ. 300 కోట్లకు మించిన బడ్జెట్​తో ఈ చిత్రం రూపొందుతోందని ఓ కార్యక్రమంలో స్పష్టం చేశారు.

'Brahmastra' Makers say budget of the Ranbir Kapoor-Alia Bhatt starrer is 'way over' Rs 300 crore
సినీపరిశ్రమ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్​తో 'బ్రహ్మాస్త్ర'
author img

By

Published : Nov 29, 2020, 7:35 AM IST

Updated : Nov 29, 2020, 11:40 AM IST

అమితాబ్​ బచ్చన్​, రణ్​బీర్​ కపూర్​, అక్కినేని నాగార్జున, అలియా భట్​ ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఇప్పటికే సుదీర్ఘకాలంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్ర బడ్జెట్​పై బాలీవుడ్​లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 'బ్రహ్మాస్త్ర' బడ్జెట్​ రూ.300 కోట్లు దాటిపోయిందని చిత్రసీమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి సంబంధించి స్టార్​ అండ్​ డిస్నీ ఇండియా ఛైర్మన్​ ఉదయ్​ శంకర్​ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

"మన దేశంలోనే ఎన్నడూ లేనంత భారీ బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కబోతోంది" అని హిందూస్థాన్​ టైమ్స్​ లీడర్​షిప్​ సమ్మిట్​ 2020 కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఎంత బడ్జెట్​లో తెరకెక్కుతోందనే విషయం చెప్పేందుకు నిరాకరించారు. రూ. 300 కోట్ల బడ్జెట్​ దాటేసిందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. "దాని కంటే ఎక్కువే" అని జవాబిచ్చారు.

రూ.300 కోట్ల బడ్జెట్​ సినిమాలు

ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో శంకర్​ '2.O', రాజమౌళి 'బాహుబలి 2', ప్రభాస్​ 'సాహో' సినిమాలు భారీ బడ్జెట్​తో తెరకెక్కాయి. అయితే 'బ్రహ్మాస్త్ర' వీటిని మించిపోనుందని బాలీవుడ్​ వర్గాలు చెబుతున్నాయి. రణ్​బీర్​, అలియా మొదటిసారి జంటగా కనిపించబోతోన్న ఈ చిత్రంలో రవీనా టాండన్​, మౌనిరాయ్​ కీలకపాత్రలో నటిస్తున్నారు.

Last Updated : Nov 29, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.