ETV Bharat / sitara

'ఇకనైనా మన తప్పులను తెలుసుకోవాలి' - కరోనా గురించి మాట్లాడిన బ్రహ్మానందం

లాక్​డౌన్​ వల్ల ఇంటికేపరిమితమైన హాస్యనటుడు బ్రహ్మానందం... పలు విషయాల గురించి మాట్లాడాడు. ప్రస్తుతం తాను ఇంట్లో ఏ విధంగా గడిపేది? తన జీవతంలో కొన్ని అనుభవాలు, కరోనా విపత్తు తదితర అంశాలపై 'ఈనాడు సినిమా'తో ముచ్చటించారు.

Brahmanandam special interview on Corona
ఇప్పుడు మనమంతా సమంగా ఉన్నట్టే
author img

By

Published : Apr 27, 2020, 6:50 AM IST

బ్రహ్మానందంని చూడగానే నవ్వొస్తుంది. నటుడిగా ఆయన ప్రేక్షకులపై చూపించిన ప్రభావం అలాంటిది. ఆయన్ని పలకరిస్తే మాత్రం పూర్వాశ్రమంలోని అధ్యాపకుడు బయటికొస్తాడు, పేదరికం నుంచి ఎదిగిన ఓ శ్రమజీవి తొంగిచూస్తాడు. ఆయన మాటలన్నీ ఒక మంచి బతుకు పాఠంలా అనిపిస్తాయి. ఆయనతో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బ్రహ్మానందం కరోనా విపత్తు, తన జీవితం, చిత్ర లేఖనం తదితర విషయాల గురించి మనసు విప్పారు.

"35 ఏళ్ల సినీ ప్రయాణం నాది. ఇదివరకు విరామం తీసుకున్నా కానీ... ఒకేసారి ఇన్ని రోజులు, ఇలాంటి విరామాన్ని మాత్రం తీసుకోలేదు. ఉంటే సినిమా సెట్‌లో లేదంటే ఇంట్లో గడుపుతుంటా. దాంతో ఇప్పుడు నాకేం ఇబ్బందిగా అనిపించడం లేదు. అందరిలాగే నేను కూడా కుటుంబంతో గడుపుతున్నాను, మనవడితో ఆడుకుంటున్నాను, పుస్తకాలు చదవడం, చిత్రలేఖనం... ఇలా మనసుకు నచ్చినవి చేస్తున్నాను. ఇలా గడుపుతున్నా, ఇవి చేస్తున్నా.. అని చెబుతానేమో కానీ - ఎన్ని చేస్తున్నా ఇందులో జీవితం మాత్రం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనసులో ఒక భయం అనేది రన్‌ అవుతూ ఉంటుంది. గుండె నుంచి ఒక సన్నటి దారం బయటికి లాగుతున్న బాధ కలుగుతుంది. బయట ఎంత మంది మనవళ్లు ఆకలితో బాధపడు తున్నారో కదా! దారి పొడవునా వలస కూలీల పరిస్థితిని ఒకసారి తలచుకొని చూడండి. ఇదా జీవితం అన్న మనోవేదన గుండెని పిండేస్తుంది. నాకు ఇల్లుంది కాబట్టి ఇంట్లో కాలక్షేపం చేస్తున్నా. ఇల్లే లేనోళ్ల పరిస్థితి? ఇళ్లల్లోకి రావద్దని చెప్పడంతో బయటే ఆగిపోతున్నవాళ్ల పరిస్థితి? అలాగని నువ్వేం చేయగలవయ్యా అంటారేమో... మనకు తెలిసిన సాయం మనం చేద్దాం. ఇంకొకడికి సాయం చేస్తున్నామని కాకుండా.. ఎదుటివాడూ మన కుటుంబ సభ్యుడే అనుకుని అండగా నిలుద్దాం. అలాంటి సమయం ఇది".

పొదుపు చేస్తేనే బతుకు

"కరోనాతో స్తంభించిపోయిన ఈ కాలంలో... అన్ని రకాలుగా ఉన్నవాళ్లకి, తినగలిగే శక్తి ఉండి ఇంట్లో కూర్చుని తింటున్నవాళ్లకి ఉపశమనంలా అనిపించొచ్చు, అందరితోపాటే మనమూ ఆగిపోయాం అనే భావన వాళ్లకి కలగొచ్చు. కానీ రెక్కాడితే కానీ డొక్కాడనివాళ్లకి మాత్రం ఇదొక భయంకరమైన శాపంలా అనిపిస్తుంది. రెండు పూటలా తిండి లేని జనం మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఈ కరోనా ఎన్నో పాఠాల్ని నేర్పించింది. పేదరికం నుంచి వచ్చినవాణ్ని కాబట్టి... భవిష్యత్తు తరాలవాళ్లకి చెప్పేదొక్కటే. వంద రూపాయలు సంపాదించుకుంటే అతికష్టం మీదైనా అందులో ఒక రూపాయైనా పొదుపు చేయాలి! వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడితే చివరికి ఏమీ మిగలదు. అనుకోకుండా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, చేతిలో ఏమీ ఉండకపోతే పేదరికంతో అలమటించాలి. కోట్లు సంపాదించేవాళ్లు కోట్లు, లక్షలు సంపాదించేవాళ్లు లక్షలు దాచి పెట్టుకుంటారు. గంజి తాగి బతికేవాళ్లు పది రోజులకి సరిపడా గంజైనా దాచుకోవాలి. మనిషి తనకున్న పనిని ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడు సహనం దానంతట అదే వస్తుంది"

అది ప్రకృతికే సాధ్యం

"మనకు విపత్తులు కొత్త కాదు కానీ... కరోనా లాంటి విచిత్రమైన విపత్తు వస్తుందని ఎవ్వరం ఊహించం. ఇది సాటి మనిషి దగ్గరికి కూడా వెళ్లే వీలు లేని పరిస్థితుల్ని సృష్టించింది. మనిషికీ, మన మనుగడకీ ఎన్నో హెచ్చరికలు చేస్తోన్న విపత్తు ఇదని నా అభిప్రాయం. అలాగని మనం దీన్నుంచి బయటికి రాలేం అని కాదు. వస్తాం కానీ... ఇది నేర్పిస్తున్న పాఠాల్ని, చేసిన హెచ్చరికల్ని మరిచిపోకూడదు. పది మంది ఎక్కాల్సిన పడవని యాభై మంది ఎక్కితే ఏమవుతుంది? కొంత స్వార్థాన్ని, కొంత దుర్మార్గాన్ని, కొంత అరాచకత్వాన్ని, కొంత నీచత్వాన్ని... ఇలా అన్నీ కొంతే అయితే భరిస్తుందేమో కానీ, నిలువెల్లా ఇదే అయినప్పుడు ఈ భూగోళం ఎక్కడ భరించగలదు? ఇది నా అజ్ఞానం కొద్దీ చెబుతున్న మాట. విజ్ఞులైనవారికి నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని ఎవ్వరు అదుపులోకి తీసుకురాగలరు... ప్రకృతి తప్ప! సమతుల్యం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రకృతితోనే సాధ్యం. ఇప్పుడు మనమందరం సమంగా ఉన్నట్టే కదా. రాజ భవనాల్లో ఉన్న దేశాధ్యక్షుల్ని కూడా కరోనా వదిలిపెట్టలేదు. ఇకనైనా మన తప్పుల్ని తెలుసుకోవాలి. మనిషి ఆశాజీవి. మార్పు అయినా మరొకటైనా రాదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఈ పూట ఆహారం దొరకలేదనుకోండి, సాయంత్రానికైనా దొరుకుతుందనే ఆశతో బతుకుతాం. సాయంత్రం రాలేదంటే రేపు వస్తుందనుకుని బతుకుతాం. మనలో మార్పు కూడా అంతే. ఎప్పుడూ చీకటే కాదు, సూర్యోదయం కూడా వస్తుంది. మేఘాలు శాశ్వతం కాదు, సూర్యచంద్రులు శాశ్వతం"’.

పరమేశ్వరుడు ఇచ్చిన కళ

"బొమ్మలు గీయడం నాకు మొదట్నుంచీ అలవాటు. లాక్‌డౌన్‌ తర్వాత శ్రీశ్రీ, రామకృష్ణ పరమహంస, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ల చిత్రాలు గీశాను. నా భార్య లక్ష్మి సలహాలు ఇస్తుంటుంది. తను చిత్రాలు గీయదు కానీ...నా చిత్ర లేఖనానికి మంచి విమర్శకురాలు. మట్టితో విగ్రహాలు కూడా చేస్తా. వినాయక చవితికి మేం ఎప్పుడూ వినాయకుడి బొమ్మని బయటి నుంచి తెచ్చుకోం. నేను మట్టితో చేసిన వినాయకుడే మా ఇంట్లో కొలువవుతాడు. నేను కె.రాఘవేంద్రరావు గారికి వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని మట్టితో తయారు చేసిచ్చాను. ఆ విగ్రహాన్ని ఆయన ఆఫీసులో పెట్టుకున్నారు. అలాగే బుద్ధుడి బొమ్మ కూడా చేసిచ్చా. రాయి మీద శిల్పం చెక్కలేను కానీ, మట్టితో చేయగలను. జన్మతః పరమేశ్వరుడి నుంచి వచ్చిన కళ అది".

ఇదీ చూడండి : ఓ మెలోడీ పాటను రాసిన ఇద్దరు రచయితలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.