Akhanda movie: థియేటర్లలో దుమ్ములేపుతూ, బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన 'అఖండ'.. 50 రోజులకు చేరువవుతోంది. ఈ క్రమంలోనే 'అఖండ'.. సంక్రాంతి సంబరాలు పేరుతో హైదరాబాద్‌లో బుధవారం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను.. 'అఖండ' సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చారు.
"అఖండ' సినిమాకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది. అందుకు కావల్సిన లీడ్ కూడా సినిమాలో చూపించాను. సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అనేది మేమే చెబుతాం' అని బోయపాటి పేర్కొన్నారు.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటించి మెప్పించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. శ్రీకాంత్ విలన్‌గా నటించారు. తమన్ సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఇదీ చూడండి: 'అఖండ'.. పాన్ వరల్డ్ సినిమా: హీరో బాలకృష్ణ