ETV Bharat / sitara

బాక్సాఫీస్​ వార్: సల్మాన్​తో జాన్​, ఆర్​ఆర్​ఆర్​తో మైదాన్​ - షేర్షా మేజర్​

ఈ ఏడాది పలు బడా సినిమాలు ఒకాదానితో మరొకటి పోటీపడుతూ థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. వాటిలో కొన్ని ఒకే రోజున రిలీజ్​ అవ్వడం ఓ విశేషం. ఇందులో ఎన్టీఆర్​,రామ్​చరణ్​, అక్షయ్​కుమార్​, అర్జున్​కపూర్​, సల్మాన్​ఖాన్​, అజయ్​దేవ్​గణ్​ సినిమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

box
బాక్సాఫీస్​
author img

By

Published : Feb 20, 2021, 8:25 PM IST

లాక్​డౌన్​తో మూగబోయిన చిత్రసీమ చాలా రోజులు తర్వాత సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమైంది. వందశాతం ఆక్యుపెన్సీకి కేంద్రం అనుమతులు ఇవ్వడం వల్ల పలు చిత్రాలు వరుసగా విడుదలయ్యేందుకు క్యూ కట్టి ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఒకదానితో మరొకటి పోటీపడుతూ థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో కొన్ని చిత్రాలైతే ఏకంగా ఒకే రోజు సందడి చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ హీరో సినిమా ఎవరితో పోటీ పడనుందో ఓ సారి లుక్కేద్దాం.

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్​ హీరో సల్మాన్​ ఖాన్ నటించిన 'రాధే' ఈ ఏడాది ఈద్​కు థియేటర్లలోకి రానుండగా.. మరోవైపు మిలాప్​ జవేరీ డైరెక్షన్​లో జాన్​ అబ్రహాం నటించిన 'సత్యమేవ జయతే 2' మే 12న రిలీజ్ కానుంది.

Boxoffice fight
రాధే, సత్యమేవ జయతే 2

అక్షయ్ కుమార్​ నటిస్తున్న స్పై థ్రిల్లర్​ మూవీ 'బెల్​ బాటమ్' ఏకంగా హాలీవుడ్​ సినిమా 'ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ 9'తో పోటీ పడనుంది. ఈ రెండు చిత్రాలు మే 28న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Boxoffice fight
బెల్​ బాటమ్​, ఫాస్ట్​ అండ్​ ఫ్యూరియస్​ 9

విష్ణు వర్థన్​ దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'షేర్షా' జులై 2న విడుదలవుతుండగా.. అదే రోజున 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'మేజర్' విడుదల కానుంది. ఇందులో అడవి శేష్​ నటించారు.

Boxoffice fight
షేర్షా, మేజర్​

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్' అక్టోబర్​ 13న విడుదలకు సిద్ధంగా ఉంది. రెండు రోజుల వ్యవధిలో అక్టోబర్​ 15న బాలీవుడ్​ హీరో అజయ్​దేవ్​గణ్​ నటించిన 'మైదాన్'​ సినిమా రిలీజ్​ కానుంది. దీనికి నిర్మాణ బోనీ కపూర్​. ఆర్​ఆర్​ఆర్​లో కూడా అజయ్​ దేవ్​గణ్​ నటిస్తుండటం మరో విశేషం. ఈ విడుదల​ తేదీల విషయంలో.. ఇరు చిత్రబృందాల మధ్య వార్​ నడుస్తోంది. ​

Boxoffice fight
మైదాన్​- ఆర్​ఆర్​ఆర్​

వెలుగుల పండగ దీపావళికి మూడు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఇందులో అక్షయ్‌కుమార్‌ 'పృథ్వీరాజ్‌'(నవంబరు 5), షాహిద్‌ కపూర్‌ 'జెర్సీ'(నవంబరు 5), ధర్మేంద్ర, సన్నీ దేఓల్, బాబీ దేఓల్‌ కలిసి నటించిన 'అప్నే 2'(నవంబరు 4) ఉన్నాయి. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది.

Boxoffice fight
పృథ్వీరాజ్​, షాహిద్​, అప్నే 2

ఇదీ చూడండి: 'దృశ్యం 2' రీమేక్​ పక్కా.. నాని 'టక్​ జగదీశ్'​ టీజర్​

ఇదీ చూడండి: బన్నీ కొత్త సినిమా అప్​డేట్​.. 'క్లైమాక్స్'​ రిలీజ్​ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.