ETV Bharat / sitara

బోనీకపూర్​ నిర్మాతగా హీరో కార్తికేయ సినిమా! - hero karthikeya

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ త్వరలోనే​ హీరో కార్తికేయతో ఓ సినిమా చేయనున్నారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం కార్తికేయ.. 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తున్నారు.

boney
బోణీ
author img

By

Published : Feb 24, 2021, 8:11 AM IST

Updated : Feb 24, 2021, 8:42 AM IST

'ఆర్​ఎక్స్​ 100'తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్​ యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు ప్రతినాయకుడిగానూ అలరించారు. ప్రస్తుతం తమిళ హీరో అజిత్​ నటిస్తోన్న 'వాలిమై'లో విలన్​ రోల్​ చేస్తున్నారు. ఈ సినిమాకు బోనీకపూర్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈయన.. కార్తికేయ నటనకు ముగ్ధుడై అతనితో తెలుగులో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని.. త్వరలోనే తమ కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన చేస్తారని తెలిసింది.

ప్రస్తుతం కార్తికేయ.. 'వాలిమై'తో పాటు 'చావు కబురు చల్లగా' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బస్తీ బాలరాజుగా కనిపించనున్నారు కార్తికేయ. ఆసుపత్రిలో పనిచేసే సిస్టర్‌ పాత్ర పోషిస్తుంది హీరోయిన్​ లావణ్య త్రిపాఠి. జాక్స్‌ బిజోయ్‌ సంగీతం అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి: 'చావు కబురు..' రిలీజ్​ డేట్​.. కిచ్చా సుదీప్​ @25

Last Updated : Feb 24, 2021, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.