తెలుగులో పాన్ ఇండియా సినిమాల జోరు కనిపిస్తోంది. అగ్ర కథానాయకుల సినిమాల్ని తెలుగుతో పాటు ఇతర భాషల్నీ లక్ష్యంగా చేసుకొని రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే వాటిలో కీలక పాత్రల కోసం.. వివిధ భాషలకి చెందిన నటీనటుల్నీ ఎంపిక చేసుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్న ఈ చిత్రం కోసం హిందీ నటులు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లను ఎంపిక చేసినట్టు సమాచారం. ఇందులో మరో కథానాయికకి కూడా చోటుందట. ఈ సినిమా కొత్త షెడ్యూల్ త్వరలోనే మొదలు కాబోతోంది.


మరో వైపు 'పింక్' తెలుగు రీమేక్‌లోనూ నటిస్తున్నాడు పవన్‌కల్యాణ్. ఈ చిత్రంలో పవన్.. న్యాయవాది పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది మే 15న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.