ETV Bharat / sitara

తెరకు పరిచయం కాకముందే ప్రకటనల్లో మెరిసిన తారలు - <iframe width="735" height="469" src="https://www.youtube.com/embed/NK5RuEa9uAU" frameborder="0" allow="accelerometer; autoplay; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe>

ఏ నటులైనా సినిమాల్లో మంచి గుర్తింపు పొందేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ క్రమంలో చిన్న చిన్న పాత్రలు, ప్రకటనల్లో నటించేందుకు వెనుకాడరు. బాలీవుడ్​లో ఎంతో పేరొందిన ప్రముఖ నటులు కూడా సినిమాలకు రాకముందు యాడ్స్​లో నటించారు.

Bollywood stars who featured in ads before getting fame
ఈ బాలీవుడ్​ ప్రముఖులు కనిపించిన ప్రకటనలు ఏవో తెలుసా!
author img

By

Published : Apr 1, 2020, 8:43 PM IST

స్టార్​ హోదా సంపాదించుకున్నవారు కూడా ప్రారంభంలో అనేక చిన్న చిన్న పాత్రల్లో నటించే ఆ స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ప్రకటనల్లో నటించి మంచి మార్కులు సంపాదించేకునే వారు అధికమే. దీపికా పదుకొణె నుంచి షారుక్​ ఖాన్​ వరకు అగ్ర నటులందరూ సినిమాల్లోకి రాకముందు పలు ప్రకటనల్లో నటించారు. మరి బాలీవుడ్​లో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ప్రముఖులు కనిపించిన ప్రకటనలు ఏవో తెలుసా..

క్లోజ్​అప్​లో దీపికా పదుకొణె

దీపికా పదుకొణె బాలీవుడ్​లో దూసుకుపోతున్న నటి. ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి రాకముందు క్లోజ్​అప్​ ప్రకటనలో కనిపించింది. ఎంతో ఫన్నీగా ఉండే ఈ ప్రకటనలో అలరించి 'ఓం శాంతి ఓం'లో ఛాన్స్​ కొట్టేసిందీ భామ. ప్రస్తుతం దీపికా భర్త రణవీర్​ ఈ క్లోజ్​ అప్​ ప్రకటనలో కనువిందు చేస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

​ సెబోలిన్​లో అనుష్క శర్మ

'రబ్​ నే బనాదీ జోడీ'లో షారుక్​ ఖాన్ సరసన నటించింది అనుష్క శర్మ. అయితే దీని కంటే ముందు ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించిందీ ముద్దుగుమ్మ. సెబోలిన్​ అనే ఓ సబ్బు యాడ్​లో నటించి సినిమాల్లో అవకాశం కొట్టేసింది.

సింథాల్​​తో షారుక్​- గౌరీ ఖాన్​

షారుక్​ ఖాన్, గౌరీ ఖాన్ కలిసి చాలా ప్రకటనలు చేశారు. వీరిద్దరూ కలిసి సింథాల్​ సబ్బు ప్రకటనలోనూ నటించారు. ఈ యాడ్​తో ఈ జంట ఎన్నో సినిమా అవకాశాలు దక్కించుకున్నారు.

లిమ్కాతో సల్మాన్​ ఖాన్​

ప్రస్తుతం ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్​ లిమ్కా ప్రకటనలో మొదటి సారి నటించాడు.

ఫెవికాల్​తో కత్రినా కైఫ్​

బాలీవుడ్​లో ఓ ప్రత్యేక ఇమేజ్​ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్​ మొదట కనిపించింది ఫెవికాల్​ ప్రకటనలో. నవ్వులు పండించే ఈ యాడ్​ కత్రినాకు ఎంతో పేరు తీసుకొచ్చింది.

పర్క్​ చాక్లెట్​​తో ప్రీతీ జింతా

చదువు పూర్తి చేసుకున్న వెంటనే ప్రీతీ జింతా మోడలింగ్​లోకి అడుగుపెట్టింది. మొదటి సారిగా ఈ ముద్దుగుమ్మ పర్క్ చాక్లెట్​ ప్రకటనలో కనిపించింది. దీని తర్వాత ఈ నటి లిరిల్​ సబ్బు యాడ్​లో నటించింది.

సర్ఫ్​ యాడ్​తో విద్యాబాలన్​

బాలీవుడ్​లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న విద్యాబాలన్​ మొదట ఓ గృహిణిగా కనిపించింది. బట్టలు ఉతికే సర్ఫ్​ ప్రకటనలో నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ నటి.

పార్కర్​ పెన్నుతో జెనీలియా

టాలీవుడ్​, బాలీవుడ్​లో మంచి పేరు తెచ్చుకున్న నటి జెనీలియా. జెన్నీ మొదటి సారి పార్కర్​ పెన్ను ప్రకటనలో కనిపించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ తన 15వ ఏటే అమితాబ్​ బచ్చన్​తో కలిసి నటించేసింది.

పాండ్స్​తో సిద్ధార్థ్ మల్హోత్రా

బాలీవుడ్​లో మంచి పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ ​మల్హోత్రా మొదటి సారి పాండ్స్​ పౌడర్​ ప్రకటనలో నటించాడు. ఇందులో సిద్ధార్థ్ సరసన సోనాల్​ చౌహన్ కూడా కనిపించింది.

బోర్న్​వీటాతో వరుణ్​ ధావన్​

తన చిన్న తనంలోనే బోర్న్​వీటా ప్రకటనలో మొదటి సారి నటించాడు వరుణ్​ ధావన్​. ఇందులో వరుణ్​తో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్​ కూడా నటించారు.

క్రాక్​ జాక్​తో బోమన్ ఇరానీ

నలభై పదుల వయసులో బాలీవుడ్​లో అడుగు పెట్టిన బోమన్​ ఇరానీ సినిమాల్లోకి రాకముందు ప్రకటనలో మిస్టర్​.జాక్​ అనే ఓ పాత్రలో నటించాడు. ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న పార్లే జీ క్రాక్​ జాక్​ ప్రకటనలో కనిపించాడీ హీరో.

న్యూయార్క్​ లొట్టోతో వివేక్​

వివేక్​ ఒబెరాయ్​ సినిమాల్లోకి రాకముందు రామ్​గోపాల్​ వర్మకు చెందిన ఓ కంపెనీలో పనిచేశాడు. న్యూయార్క్​ లొట్టో అనే ప్రకటనలో కనిపించాడు. ఈ వాణిజ్య ప్రకటనను మనదేశంలో బ్యాన్​ చేశారు.

కాంప్లాన్​తో షాహిద్​ కపూర్​, ఆయేషా టాకియా

ఆన్ స్క్రీన్ జంటగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షాహిద్​ కపూర్​, ఆయేషా టాకియా. ఎన్నో ప్రకటనలు, సినిమాల్లో కలిసి నటించిన వీరు మొదటిసారి కాంప్లెన్ యాడ్​లో కనిపించారు.

ఇదీ చదవండి: 'ప్రస్తుతం నేను ఏ సినిమా చేయడం లేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.