ETV Bharat / sitara

ఓటీటీలకు క్యూ కట్టిన బాలీవుడ్​.. మరి టాలీవుడ్?

author img

By

Published : Jun 30, 2020, 10:49 AM IST

ఓటీటీల్లో విడుదల విషయమై టాలీవుడ్​ కంటే బాలీవుడ్​ విభిన్నంగా ఆలోచిస్తోంది.​ ఇప్పటికే అక్కడి చిత్రపరిశ్రమలోని ప్రముఖ నటీనటుల సినిమాలు, వెబ్​సిరీస్​లు ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. అవేంటో చూద్దాం.

ఓటీటీలకు క్యూ కట్టిన బాలీవుడ్​.. మరి టాలీవుడ్?
బాలీవుడ్​ సినిమాలో ఓటీటీల్లో విడుదల

కరోనా లాక్​డౌన్​తో షూటింగ్​లు నిలిచిపోయాయి. దీంతో వెండితెర బోసిపోయింది. ప్రొజెక్టర్​ ఆగిపోయింది. టికెట్​ కొనేవాడు లేక కౌంటర్​ ఖాళీ అయిపోయింది. వైరస్​ వ్యాప్తి అంతకంతకు పెరుగుతున్న కారణంగా ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలకు ఓటీటీ ప్లాట్​​ఫామ్​లే దిక్కవుతున్నాయి. అయితే టాలీవుడ్​లోని పలువురు దర్శక నిర్మాతలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారా? అని ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్​లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పలువురు స్టార్స్​ నటించిన చిత్రాలు, వెబ్​ సిరీస్​లు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డిస్నీ+హాట్​స్టార్​లో ఏడు సినిమాలు

సోమవారం జరిగిన 'బాలీవుడ్ కి హోం డెలివరీ' లైవ్ కార్యక్రమంలో మాట్లాడిన పలువురు బాలీవుడ్ స్టార్స్.. తమ కొత్త సినిమాల్ని డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో అక్షయ్ కుమార్ 'లక్ష్మీబాంబ్', అజయ్‌ దేవగణ్​‌ 'భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా', సుశాంత్ సింగ్ రాజ్​పుత్ 'దిల్ బెచారా', ఆలియా భట్‌ 'సఢక్‌2', అభిషేక్‌ బచ్చన్‌ 'ది బిగ్‌బుల్‌', విద్యుత్‌ జమ్వాల్‌ 'ఖుదా హఫీజ్‌', కునాల్‌ ఖేమూ 'లూట్‌ కేస్‌' చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ జులై నుంచి అక్టోబరు మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

dil bechara
దిల్​బెచారా సినిమాలో సుశాంత్ సింగ్- సంజనా సంఘీ

అభిషేక్, నిత్యా మేనన్- 'బ్రీత్' సీజన్ 2

ప్రముఖ కథానాయకుడు అభిషేక్​ బచ్చన్, నటి నిత్యా మేనన్.. 'బ్రీత్: ఇన్​టూ ద షాడోస్' వెబ్​సిరీస్​తో ఓటీటీ అరంగేట్రం చేశారు. వీరితో పాటే తొలిసీజన్​లో నటించిన సయామీ ఖేర్, అమిత్ సాధ్.. ఇందులో కీలక పాత్రలు పోషించారు. కుమార్తె కోసం వెతికే తండ్రి పాత్రలో అభిషేక్ కనిపించనున్నారు. అమెజాన్​ ప్రైమ్​లో జులై 10 నుంచి ఈ సిరీస్​ స్ట్రీమింగ్​ కానుంది.

abhisekah nitya menon
బ్రీత్ వెబ్​సిరీస్​లో అభిషేక్ బచ్చన్-నిత్యామేనన్

జాన్వీ కపూర్-గుంజన్ సక్సేనా

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నటించిన బయోపిక్ 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్'. 1999 కార్గిల్ యుద్ధంలో ప్రముఖపాత్ర వహించిన ఇండియన్ ఎయిర్​ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా దీనిని తెరకెక్కించారు. త్వరలో ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది. ఈ చిత్ర హక్కులు రూ.70 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేశారని సమాచారం.

jhanvi kapoor gunjan saxena
గుంజన్ సక్సేనా సినిమాలో జాన్వీ కపూర్

విద్యాబాలన్-శకుంతలదేవి

భారతీయ గణితశాస్త్ర దిగ్గజం శకుంతలదేవి జీవితం ఆధారంగా తీసిన సినిమా 'శకుంతల దేవి'. ఆమె పాత్రను ప్రముఖ నటి విద్యాబాలన్ పోషించారు. ఇప్పటికే లుక్స్​ను ప్రేక్షకులతో పంచుకున్నారు. తొలుత థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నప్పటికీ, కరోనా వల్ల ఓటీటీ వేదికగా అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. త్వరలో అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం.

vidya balan in shakunthala devi
'శకుంతలా దేవి'లో విద్యాబాలన్

మనోజ్ భాజ్​పాయ్, సమంత- ద ఫ్యామిలీ మ్యాన్ 2

దేశంలో అసాంఘిక కార్యకలాపాలు సృష్టించేందుకు పన్నాగం వేసిన ఉగ్రవాదులను, ఎన్​ఐఏ అధికారులు ఎలా మట్టుబెట్టారు అనే కథాంశంతో తెరకెక్కిన వెబ్​ సిరీస్​ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఇప్పటికే వచ్చిన తొలి సీజన్​ విపరీతమైన స్పందన దక్కించుకోగా, రెండో సీజన్​ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మనోజ్ భాజ్​పాయ్​తో పాటు దక్షిణాది ముద్దుగుమ్మ సమంత ఇందులో నటిస్తుండటం వల్ల అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఈమె ఉగ్రవాది పాత్రలో కనిపించనుందని సమాచారం. త్వరలో అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్​ కానుందీ సీజన్.

వీటితో పాటే సైఫ్ అలీఖాన్(దిల్లీ-అమెజాన్ ప్రైమ్), స్వరభాస్కర్(రస్బరీ-అమెజాన్ ప్రైమ్), రైమా సేన్(ద లాస్ట్ అవర్-అమెజాన్ ప్రైమ్), కొంకణ్ సేన్ శర్మ(ముంబయి డైరీస్ 26/11-అమెజాన్ ప్రైమ్), అమోల్ పాలేకర్-మానవ కౌల్(గోర్​మింట్-అమెజాన్ ప్రైమ్), అఫ్తాబ్ శివ్​దశానీలు(పాయిజన్:2-జీ5).. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఓటీటీ సంస్కృతి ఇలానే కొనసాగితే, ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత సినీ వీక్షకుడు థియేటర్​లో చూసేందుకు ఇష్టపడతాడా? డిజిటల్​వైపే మొగ్గుచూపుతాడా? అనేది ఇప్పుడు అందరి మదిలో మెదిలే ప్రశ్న.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.