బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ తన స్నేహితుడు, సహనటుడైన షారుఖ్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల నటి ఐశ్వర్యా రాయ్ మేనేజర్‌ను మంటల నుంచి కాపాడినందుకు బాద్షాను మెచ్చుకున్నాడీ కండల వీరుడు. షారుఖ్ రియల్ హీరో అని పొగుడుతూనే.. చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా నుంచి ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేశాడు. 'మంటల్లోకి దూకి.. ప్రాణాలను కాపాడేవాడే హీరో' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఏమైంది..?
ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నివాసంలో దీపావళి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా, షాహిద్ కపూర్, మిర్జా రాజ్‌పుత్, అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ సహా అమితాబ్ కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో నటి ఐశ్వర్య రాయ్ మేనేజర్ అర్చనా సదానంద్ లెహెంగాకు నిప్పు అంటుకుంది. దీన్ని గమనించిన షారుఖ్ వెంటనే మంటల్ని ఆర్పేశాడు. ఈ ప్రమాదంలో అర్చన స్వల్పగాయాలతో బయటపడగా.. కింగ్ ఖాన్‌కు కూడా చిన్నపాటి గాయలైనట్లు సమాచారం.
![bollywood star hero Salman calls SRK 'real hero' for saving Aish's manager from diwali fire mishap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4919673_manager.jpg)
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ ఏడాది విడుదలైన సల్మాన్‌ఖాన్ 'భారత్' చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ హీరో ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న 'దబాంగ్ 3'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సోనాక్షి సిన్హా కథానాయిక. గతేడాది విడుదలైన 'జీరో' సినిమాలో చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్ ఖాన్. చాలా రోజుల విరామం తర్వాత 'మెర్సల్' హిందీ రీమేక్‌లో.. కోలీవుడ్ దర్శకుడు అట్లీతో కలిసి ఈ స్టార్ హీరో పనిచేస్తాడని వార్తలు వస్తున్నాయి.