భాజపాకు బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన కొందరు నటులతో పాటు ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఇందుకోసం దిల్లీలో గెట్ టూ గెదర్ సమావేశం నిర్వహించారు. నిర్మాత బోనీ కపూర్‌తో పాటు రెజ్లర్ గ్రేట్ కలీ, నృత్యకారిణి సప్నా చౌదరి, నటుడు మనోజ్ జోషితో పాటు పలువురు హాజరయ్యారు. నరేంద్రమోదీ మరోసారి ప్రధాని కావాలని వారు ఆకాంక్షించారు.
విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. భాజపా ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ సింగ్, అరుణ్ సింగ్ కూడా హాజరై మోదీ ఐదేళ్ల పాలన గురించి వివరించారు.
సినీ పరిశ్రమకు మోదీ చాలా సహాయం చేశారని.. వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని బాలీవుడ్ నిర్మాత్ బోనీ కపూర్ తెలిపారు.