ETV Bharat / sitara

సుశాంత్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు: నగ్మ

డ్రగ్స్ కేసులో సినీ నటి, భాజపా నాయకురాలు జయప్రద చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు మరో నటి కాంగ్రెస్ నేత నగ్మ. సుశాంత్ కేసును తప్పుదోవపట్టించేందుకు డ్రగ్స్ కోణాన్ని బయటకు తీసుకువచ్చారని తెలిపారు.

Bollywood drug story a diversion from SSR death case: Nagma
సుశాంత్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు: నగ్మ
author img

By

Published : Sep 18, 2020, 10:17 AM IST

Updated : Sep 18, 2020, 11:45 AM IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు ఎన్నో మలుపులు తీసుకుంటోంది. డ్రగ్స్ కోణంలో సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తితో పాటు పలువురిని విచారిస్తోన్న ఎన్​సీబీ పలు కీలక విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం. అయితే సుశాంత్ కేసును తప్పుదోవ పట్టించేందుకే డ్రగ్స్ కోణాన్ని బయటకు తీసుకొచ్చారని ఆరోపించారు సినీ నటి, కాంగ్రెస్ నేత నగ్మ.

"ఎన్​సీబీ, సీబీఐ, ఈడీ దయచేసి జయప్రదజీకి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో చెప్పండి. ఈ కేసు విషయంలో అందరం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. ఈ కేసును పక్కదోవపట్టించడానికి అకస్మాత్తుగా భాజపా నేతలు డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతున్నారు. దేశమంతా ప్రస్తుతం సుశాంత్​కు న్యాయం కోసం చూస్తోంది."

ఇటీవల ఇదే విషయమై మాట్లాడిన సినీ నటి, భాజపా నాయకురాలు జయప్రదకు కౌంటర్​గా ఈ వ్యాఖ్యలు చేసింది నగ్మ.

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ డ్రగ్స్‌కు బానిసగా మారిందంటూ పార్లమెంటులో ఎంపీ రవికిషన్‌ వ్యాఖ్యలను సమర్థించారు సీనియర్​ నటి, భాజపా నాయకురాలు జయప్రద. అంతేకాదు జయాబచ్చన్​ దీనికి వ్యతిరేకంగా మాట్లడటం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని.. డ్రగ్స్​కు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా గళం వినిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జయప్రద.

Last Updated : Sep 18, 2020, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.