ETV Bharat / sitara

'మీడియాలో నా పేరు రాకుండా ఆదేశాలివ్వండి' - డ్రగ్స్​ కేసులో హైకోర్టును ఆశ్రయించిన రకుల్​

మాదకద్రవ్యాల వినియోగం కేసులో తన పేరును ముడిపెడుతూ మీడియాలో వస్తున్న కథనాలను నియంత్రించాలంటూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది నటి రకుల్​ప్రీత్​ సింగ్​. ఈ మేరకు ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా, న్యూస్​ బ్రాడ్​కాస్టర్​ అసోసియేషన్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేసింది.

Bollywood Drug Case: Actor Rakul Moves Delhi HC Seeking To Restrain Media Reporting Against Her
'మీడియాలో నా పేరు రాకుండా ఆదేశాలివ్వండి'
author img

By

Published : Sep 27, 2020, 9:35 AM IST

డ్రగ్స్​ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తితో ముడిపెడుతూ తనపై కథనాలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించాలంటూ సినీ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. శనివారం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ ఆసోషియేషన్‌లను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేసింది.

గతంలో కొన్ని నివేదికలు తనపై తప్పుడు ప్రచారాన్ని చేశాయని.. అలా చేయకుండా ఆదేశమివ్వాలని దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​లో పేర్కొంది రకుల్.

డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ ఎదుట హాజరుకాక ముందే తన పేరును మీడియాలో రాకుండా చర్యలు చేపట్టడానికి దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది రకుల్.

అక్టోబరు 15కు వాయిదా

ఈ కేసుకు సంబంధించి కేంద్రప్రభుత్వం, ప్రసార భారతి, ప్రెస్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా, న్యూస్​ బ్రాడ్​కాస్టర్​ అసోసియేషన్​లకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. దీంతో పాటు రకుల్​ప్రీత్​ దాఖలు చేసిన పిటిషన్​ను పరిగణనలోకి తీసుకుని తాత్కాలికంగా ఆదేశాలను ఇవ్వడం సహా దీనిపై సత్వరం తమ నిర్ణయాన్ని తెలపాలని కోర్టు వారికి విజ్ఞప్తి చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.